Space Suits That Convert Urine Into Water: యుఎస్‌లోని ఓ విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ చేశారు. మూత్రాన్ని 5 నిమిషాల్లో ఫిల్టర్ చేసి నీటిగా మార్చేసే స్పేస్‌సూట్లను(Space Suits) తయారుచేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఒక విప్లవాత్మక పూర్తి-శరీర స్పేస్ సూట్‌ను రూపొందించారు. ఇది వ్యోమగాములు అంతరిక్ష యాత్ర సమయంలో మూత్రాన్ని నీరు గా మార్చి తాగడానికి ఉపయోగపడనుంది. నాసా ప్రస్తుత స్పేస్‌సూట్‌ల వలె కాకుండా, వ్యర్థాలను నిర్వహించడానికి 1970ల చివరి నుంచి గరిష్ట శోషణ వస్త్రాలు (MAGs)పై ఆధారపడి ఉన్నాయి.
కార్నెల్ బృందం అభివృద్ధి చేసిన వినూత్న స్పేస్ సూట్ ప్రోటోటైప్‌లో వాక్యూమ్-ఆధారిత బాహ్య కాథెటర్ సిస్టమ్‌ను పొందుపరిచారు. ఈ వ్యవస్థ వ్యోమగాములకు నిరంతర సురక్షితమైన నీటి సరఫరాను అందిస్తుంది. మూత్రాన్ని తాగునీరుగా సమర్ధవంతంగా మారుస్తుంది.
Also read: రూ. 3 లక్షల లోపు జీతం ఉన్న వారికి నో టాక్స్..
ఈ అధునాతన వ్యవస్థ వ్యోమగాములకు నిరంతర సురక్షితమైన నీటి సరఫరాను లభిస్తుంది. వెయిల్ కార్నెల్ మెడిసిన్‌లో పరిశోధనా సిబ్బంది సోఫియా ఎట్లిన్, వ్యోమగామి ఆరోగ్యాన్ని రక్షించడానికి రూపొందించిన బహుళ భద్రతా విధానాలను ఇందులో హైలైట్ చేశారు. జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ స్పేస్ టెక్నాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కొత్త వ్యవస్థ కేవలం ఐదు నిమిషాల్లో 500ml మూత్రాన్ని సేకరించి శుద్ధి చేయగలదన తెలుస్తోంది. 2025 నాటికి ఇది అందుబాటులోకి రానుంది.