Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి

నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశించినట్లు పేర్కొంది. వారం, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి
New Update

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళతో పాటు ఈశాన్య భారత రాష్ట్రాల్లోకి రుతుపవనాల ప్రవేశించినట్లు పేర్కొంది. సాధారణం కంటే రెండు రోజులు ముందుగానే కేరళకు రుతుపవనాలు చేరుకున్నాయి. రుతుపవనాల రాకకు అనుకూలంగా వేగంగా పరిస్థితులు మారాయి. రేమాల్ తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లోకి ముందుగానే నైరుతి ఎంట్రీ ఇచ్చాయి. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. కేరళలో ఇప్పటికే వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వారం, పది రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా రేపు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


#southwest-monsoon
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe