సంక్రాంతి పండుగ అంటే ఆ సందడి మాములుగా ఉండదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేడుకను మూడురోజుల పాటు ప్రజలు సంతోషంగా గడుపుతారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే జోరుగా కోళ్ల పందెలు జరుగుతుంటాయి. అందుకే పట్టణాలు, నగరాల్లో నివసించే వారు సంక్రాతికి తమ సొంతూర్లకు పయనమవుతుంటారు. దీంతో బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో 6 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి నగరాల మధ్య జనవరి 10 నుంచి 15 తేదీల్లో సర్వీసులు అందించనుంది.
Also read: కేసీఆర్ ప్రతిపక్షంలో ఉంటే డేంజర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
రైళ్ల వివరాలివే
1. తిరుపతి - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07055)
జనవరి 10న రాత్రి 8.25 PM గంటలకు బయల్దేరి 11న ఉదయం 9.10 AM గంటలకు గమ్యస్థానానికి చేరుకోనుంది.
2. సికింద్రాబాద్ -కాకినాడ టౌన్ రైలు (07056)
జనవరి 11న రాత్రి 7 PM గంటలకు బయలుదేరి 11న ఉదయం 6.45 AM గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.
3. కాకినాడ టౌన్ -సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07057)
జనవరి 12న రాత్రి 9 PM గంటలకు కాకినాడలో బయల్దేరి 11న ఉదయం 8.30 AM గంటలకు సికింద్రాబాద్ చేసుకోనుంది.
4. సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (07071)
జనవరి 13న రాత్రి 9 PM గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 AM గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
5. కాకినాడ టౌన్ - తిరుపతి ప్రత్యేక రైలు (07072)
జవనరి 14న ఉదయం 10 AM గంటలకు బయల్దేరి అదేరోజున రాత్రి 8.20 PM గంటలకు తిరుపతి చేరుకుంటుంది.
6. తిరుపతి -కాచిగూడ ప్రత్యేక రైలు (02707)
జనవరి 15న ఉదంయ 5.30 AM గంటలకు బయల్దేరి అదేరోజు సాయంత్రం 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
Also Read: లక్షద్వీప్‌లో నిర్లవణీకరణ (డీశాలినేషన్) ప్రక్రియ ప్రారంభం..!