Sankranti Special Trains: సంక్రాంతి పండుగకు సొంతూర్లకు వెళ్లే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన రెండు రోజులకే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సంక్రాంతి సెలవులను ప్రకటించాయి. దీంతో ఊర్లకు బయల్దేరి వెళ్లాలి అనుకునే వారు రెండు నెలల ముందు నుంచే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణికులు రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ వార్తతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయని తెలుస్తుంది. ఉద్యోగాలు, చదువుల నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నవారు పెద్ద పండుగ అయిన సంక్రాంతికి ఊరెళ్లేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఎక్కడ నుంచి ఎక్కడి వరకు..
ఈ క్రమంలోనే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలుస్తుంది. సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మ్యధ్య రెండు ప్రత్యేక రైళ్లు , హైదరాబాద్- కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మొత్తం నాలుగు రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది.
జనవరి 11 రాత్రి స్పెషల్ ట్రైన్ నెం.07021 రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ నుంచి మొదలై మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకోనుంది. కాకినాడ నుంచి 07022 జనవరి 12 వ తేదీన సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ కు రానుంది.
రైళ్లు ఆగే స్టేషన్లు..
అంతేకాకుండా రైలు నెం 07023 జనవరి 12న సాయంత్రం 6.30 కు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. కాకినాడ నుంచి రైలు నెం 07024 జనవరి 13న రాత్రి 10 కి మొదలై మరుసటి రోజు ఉదయం 8.30 కు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు అన్ని కూడా జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ , తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ కి నడిచే రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్ , తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట సంక్షన్ రైల్వే స్టేషన్లలో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also read: బీసీ సోదరుల జోలికి ఎవరూ వచ్చే ధైర్యం చేయకూడదు: చంద్రబాబు!