వారంపాటు 24 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్

ఒడిషా రైలు ప్రమాదం తర్వాత రైల్వే అధికారులు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నారు. అదేవిధంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తాత్కాలిక మరమ్మతులు కూడా చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈనెల 3 నుంచి జూలై 9 వరకు 24 రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా రైల్వే అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

New Update
వారంపాటు 24 రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్

South Central has canceled 24 trains for the week

పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు

హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్ల పరిధిలో ట్రాక్ మెయింటనెన్స్ పనుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు వివిధ రూట్లలో నడుస్తున్న 24 రైళ్లను ఆపేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా లింగంపల్లి, ఫలక్‌నుమా, ఉందానగర్, రామచంద్రాపురం మధ్య నడిచే 22 ఎంఎంటీఎస్ సర్వీసులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు సహకరించాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

రద్దు చేసిన సర్వీసులు

కాజీపేట–డోర్నకల్, విజయవాడ–డోర్నకల్, భద్రాచలం–విజయవాడ, విజయవాడ–భద్రాచలం, సికింద్రాబాద్–వికారాబాద్, వికారాబాద్–కాచిగూడ, సికింద్రాబాద్–వరంగల్, వరంగల్–హైదరాబాద్, సిర్పూర్ టౌన్–కరీంనగర్, కరీంనగర్–నిజామాబాద్, కాజీపేట–సిర్పూర్ టౌన్, బల్లార్షా–కాజీపేట, భద్రాచలం–బల్లార్షా, సిర్పూర్ టౌన్–భద్రాచలం, కాజీపేట–బల్లార్షా, కాచిగూడ–నిజామాబాద్, నిజామాబాద్–నాందేడ్.అదేవిధంగా.. కాచిగూడ-మహబూబ్‌నగర్ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ఉందానగర్ వరకు, నాందేడ్–నిజామాబాద్-పండర్పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ముత్కేడ్ వరకు మాత్రమే నడుస్తుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు