Ind vs SA: మరో ‘సారీ!’.. మూడో రోజే ముంచేసిన సఫారీలు ప్రొటిస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న టీమిండియా మరోసారి తుస్సుమంది. ఈ దఫా కూడా మంచి అవకాశాన్ని కోల్పోయింది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. By Naren Kumar 28 Dec 2023 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Ind vs SA: ప్రొటిస్ గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందనుకున్న టీమిండియా మరోసారి తుస్సుమంది. ఈ దఫా కూడా మంచి అవకాశాన్ని కోల్పోయింది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. సఫారీలు మూడో రోజే ఆట ముగించారు. సెంచరీతో చెలరేగిన డీన్ ఎల్గర్(185) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తొలిరోజు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి నుంచీ టీమిండియాపై ఆధిపత్యం కనబరిచింది. సఫారీ పేసర్లు సంధించిన బంతులకు భారత బ్యాటర్లు వరుస కట్టి ఔటయ్యారు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ(5), ఆదుకుంటాడనుకున్న విరాట్ కోహ్లి(38) కనీస ప్రభావం చూపలేకపోయారు. ఆరో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ వికెట్ల పతనాన్ని ఆపి హాఫ్ సెంచరీతో ఆ రోజు ఆట ముగించాడు. రెండో రోజు సెంచరీ పూర్తి చేసిన రాహుల్‌ను నండ్రీ బర్గర్ బౌల్డ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 67.4 ఓవర్లలో టీమిండిచా కేవలం 245 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది కూడా చదవండి: అసలుసిసలైన కిక్.. ఉత్కంఠగా పాక్-ఆసీస్ బాక్సిండ్ డే టెస్ట్! సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అదిరిపోయే ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికా ఆధిపత్యాన్ని చాటగా, డెబ్యూమ్యాచ్ ఆడుతున్న బ్యాటర్ బెడింగ్‌హామ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి సౌతాఫ్రికా 256 పరుగులతో స్వల్ప ఆధిక్యం సాధించింది. మూడో రోజు 408 పరుగులకు ప్రొటిస్ జట్టు ఆలౌట్ కావడంతో 163 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మరోసారి కూడా టీమిండియాను ప్రొటిస్ పేసర్లు గట్టి దెబ్బకొట్టారు. రోహిత్ శర్మ అయితే పరుగుల ఖాతానే తెరవలేకపోయాడు. యశస్వి జైస్వాల్(5)ను బర్గర్ ఔట్ చేశాడు. తర్వాత శుబ్‌మన్ గిల్(26), శ్రేయస్ అయ్యర్(6)ను జాన్సెన్ వెనక్కు పంపాడు. కోహ్లి ఆచితూచి ఆడినా, మరో ఎండ్ లో సరైన సపోర్ట్ దొరకలేదు. కేఎల్ రాహుల్(4) ఇలా వచ్చి అలా వెళ్లడంతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ వేగంగా కూలిపోయింది. క్రీజులోకి వచ్చిన అశ్విన్ తర్వాతి బంతికే ఔటైపోయాడు. శార్దూల్ ఠాకూర్ ను రబాడా ఔట్ చేయగా, సమన్వయ లోపంతో బుమ్రా రనౌట్ గా వెనుదిరిగాడు. చివరికి జాన్సెన్ బౌలింగ్ లో కోహ్లీ రబాడా చేతికి చిక్కడంతో టీమిండియా ఓటమితో మ్యాచ్ కు తెరపడింది. సఫారీ బౌలర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లు తీయగా, రబడ రెండు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. #ind-vs-sa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి