Sonu Sood : వరద బాధితులకు అండగా సోనూసూద్.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వరద బాధితుల కోసం అండగా నిలిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. లేదా మా ఫౌండేషన్ కు మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయి మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారని తెలిపారు.. By Anil Kumar 04 Sep 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bollywood Actor Sonu Sood : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడంతో పాటు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమవంతు సాయంగా భారీ విరాళాలు ప్రకటించగా.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సైతం వరద బాధితుల కోసం అండగా నిలిచారు. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో వర్షాల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసం మా టీమ్ కూడా అక్కడికి వెళ్ళింది. I greatly appreciate your gesture, @SonuSood. Thank you for taking the initiative to help our people and also inspiring countless others to do so. Your help will go a long way in comforting our people in their time of need. #2024APFloodsRelief#AndhraPradesh https://t.co/wBSggYYuEh — N Chandrababu Naidu (@ncbn) September 4, 2024 Also Read : వరద బాధితులకు సాయంగా కోటి విరాళం ప్రకటించిన పుష్పరాజ్! మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. లేదా మా ఫౌండేషన్ కు మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయి మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారు. నాలాగే వరద బాధితుల కోసం అండగా నిలిచినా ప్రతీ ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా' అని పేర్కొన్నారు. కాగా ఈ వీడియోను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ సోనూసూద్ కు థ్యాంక్స్ చెప్పారు.' మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎంతో అభినందిస్తున్నా, మా ప్రజలకు సహాయం చేయడానికి చొరవ తీసుకున్నందుకు ధన్యవాదాలు. మీ సహాయం మా ప్రజలకు అవసరమైన సమయంలో ఓదార్పునిస్తుంది' అని రాసుకొచ్చారు. #sonu-sood మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి