/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-REVANTH-REDDY-SONIA.jpg)
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ పర్యటను రద్దు చేసుకుంది. జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సోనియా గాంధీ హాజరు కావడం లేదని ఏఐసీసీ పేర్కొంది. అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల డిల్లీకి వెళ్లి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని సోనియా గాంధీని ఆహ్వానించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం రేపు సోనియా గాంధీ తెలంగాణకు రావాల్సి ఉండగా.. అనారోగ్యం కారణంగా తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నారు.
సీఎం రేవంత్‌కు సోనియా షాక్.. అనారోగ్యం కారణంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావడం లేదని సోనియా గాంధీ ప్రకటన.#cmrevanthreddy #soniagandhi #congress #telanganaformationday pic.twitter.com/cdSlEFoqaT
— Vijay Reddy (@vijay_reports) June 1, 2024