SoniaGandhi: మరోసారి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

New Update
SoniaGandhi: మరోసారి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ

నిలకడగానే సోనియా ఆరోగ్యం..

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. స్వల్ప జ్వరంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. కరోనా తరువాత తలెత్తిన పలు ఆరోగ్య సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆమె చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా అమెరికా వెళ్లి ఆమె చికిత్స పొందారు. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కూడా సోనియా పాల్గొన్నారు.

శ్వాసకోస ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న సోనియా..

సోనియా గాంధీకి చాలా కాలంగా అనారోగ్య సమస్యలున్నాయి. గతంలో ఉన్న విధంగా చురుగ్గా ఆమె రాజకీయ సమావేశాలకు హాజరుకావడం లేదు. తప్పనిసరి మీటింగ్‌లకు వస్తున్నారే కానీ మునపటిలాగా ఆమె ప్రజాజీవితంలో ఎక్కువగా కనిపించడంలేదు. శ్వాసకోస ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఇక కొద్దిరోజుల క్రితం యాంటీ-బీజేపీ మిత్రపక్షాల భేటీకి సోనియా హాజరయ్యారు. మిగిలిన పార్టీలతో కలిసి భవిష్యత్‌ కార్యచరణపై చర్చించారు. UPAపేరును INDIAగా మార్చిన ఈ మీటింగ్‌కి 26రాజకీయ పార్టీలు అటెండ్‌ అయ్యాయి. రెండు రోజుల మీటింగ్‌ తర్వాత తిరిగి ఢిల్లీకి ప్రయాణమైన సోనియా ఇవాళ పార్లమెంట్‌ సమావేశాలకు వచ్చారు.

సోనియా ఆరోగ్యంపై మోదీ వాకబు..

INDIA మిత్రపక్షాల భేటి తర్వాత సోనియా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఆక్సిజన్‌ మాస్కు పెట్టుకున్నారు. ఈ ఫొటోను తనయుడు రాహుల్‌ గాంధీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 'తీవ్ర ఒత్తిడిలోనూ ధైర్యంగా ఉన్న అమ్మ' అంటూ రాహుల్‌ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇదే క్రమంలో పార్లమెంట్‌ సమావేశంలో మొదలవడం..అక్కడ సోనియాను మోదీ పలకరించి ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు