కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. మరోసారి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సమావేశం జరగగా.. ఎంపీలందరూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదటగా సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల నుంచి మద్దతు లభించింది.
Also read: కేంద్ర కేబినెట్‌లో టీడీపీ బెర్త్‌లు ఖరారు..!
సీపీపీ నాయకిరాలిగా ఎన్నికైన అనంతరం సోనియా గాంధీ మాట్లాడారు. ఇకనుంచి క్రియాశీలకంగా పనిచేయాలని ఎంపీలకు సూచనలు చేశారు. సీపీపీ సభ్యులుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. పార్లమెంటులో ఎన్డీయే ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదని వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. గత లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రిగా పనిచేసిన సోనియాగాంధీ ఈసారి కూడా ఈ పదవికి ఎంపికయ్యారు. 20 ఏళ్ల పాటు లోక్‌సభ సభ్యురాలిగా కొనసాగిన ఆమె.. ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: నడి రోడ్డుపై దారుణం.. యువతిని కత్తితో పొడిచి అలా చేసిన యువకుడు!