Children Tips: పిల్లలు ప్రతిదానికీ ఎస్ చెప్పే బదులు కొన్నిసార్లు నో అని చెప్పడం కూడా ముఖ్యమే. ఎందుకంటే ఇది వారికి మంచిదని, అంతేకాకుండా తప్పులపై అవగాహన కూడా కలుగుతుందని నిపుణులు అంటున్నారు. నో చెప్పడం పిల్లలకు క్రమశిక్షణ నేర్పుతుంది. ప్రతిదానికీ ఒక పరిమితి ఉందని తెలుసుకోవడంలో ఇది వారికి సహాయపడుతుంది. చిన్న పిల్లలకు మంచి, చెడు మధ్య తేడా అర్థం కాదు.
మీరు కాదు అని చెబితే వారికి తప్పు అర్థమవుతుంది. ఎల్లప్పుడూ పిల్లలకు ఓకే చెప్పడం ద్వారా పిల్లలు తమ గురించి ఆలోచించడం అలవాటు చేసుకోరు. నో చెప్పడం ద్వారా వారు తమ సొంత ఆలోచనలను మొదలుపెడతారని నిపుణులు అంటున్నారు. మీరు పిల్లలకు నో చెప్పినప్పుడల్లా ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందో వివరంగా చెప్పాలి. ఎట్టి పరిస్థితుల్లో వారి మనసు నొచ్చుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా పిల్లలు అర్థం చేసుకునేలా పరిస్థితిని వారికి వివరించాలి. మీరు చెప్పే విషయం విని పిల్లలు తమను తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారని. తప్పును తెలుసుకోవాలి. మరోసారి ఆ తప్పు చేయకుండా ఉండాలి. ఒకసారి మీరు నో అని చెబితే వెనక్కి మాత్రం తగ్గకండి. దీంతో తల్లిదండ్రుల మాటే అంతిమమని పిల్లలకు అర్థమవుతుంది. మారాం చేయకుండా చెప్పినట్టు వినడం మొదలుపెడతారని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: వేసవిలో ముఖాన్ని ఎన్నిసార్లు కడిగితే మంచిది?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.