Ayodhya Utsav:అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్‌లో మార్పు

అయోధ్య ఉత్సవానికి ఇండియన్ రైల్వేస్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ లో కొన్నింటి టైమింగ్స్‌ను మార్చింది. ప్రస్తుతం అయోధ్య వెళ్ళే రైళ్ళకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఈ మార్పులు చేస్తున్నట్టు రైల్వేస్ ప్రకటించింది.

New Update
Ayodhya Utsav:అయోధ్య వెళ్ళే రైళ్ళ కోసం మిగతా ట్రైన్స్ షెడ్యూల్‌లో మార్పు

Train schedule:అయోధ్య ప్రారంభోత్సవానికి వెళ్లాలనుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటోంది ఇండియన్ రైల్వేస్. ఈ రూట్లో వెళ్ళే ట్రైన్స్ కు డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతుండడం వల్ల రైళ్ల వేళల్లోనూ మార్పులు చేసింది. డిమాండ్‌కి తగ్గట్టుగా రైల్ సర్వీస్‌లను నడపడంతో పాటు ఎక్కువగా ఆలస్యం అవకుండా, ప్రయాణికుల ఇబ్బందులు పడకుండా ట్రైన్ టైమింగ్స్‌ను కూడా షెడ్యూల్ చేసింది. కేంద్రమంత్రి దర్శన జర్దోష్ ఈ మేరకు ఓ అఫీషియల్ లిస్ట్ విడుదల చేశారు.

Also Read:ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎఫ్‌ఐఆర్ తప్పనిసరిగా ఉండాలా?

కేంద్రమంత్రి విడుదల చేసిన లిస్ట్‌లో ట్రైన్ టైమింగ్స్ వివరాలు వెల్లడించారు. సోషల్ మీడియా వేదికగా ఈ షెడ్యూల్‌ని పోస్ట్ చేశారు. సూరత్‌లోని ఉధ్నా స్టేషన్ నుంచి అయోధ్యకి జనవరి 30న ఓ ట్రైన్‌ అందుబాటులో ఉంది. ఆ తరవాత ఫిబ్రవరి 10వ తేదీన ఇండోర్ నుంచి అయోధ్యకి స్పెషల్ ట్రైన్‌ షెడ్యూల్ చేశారు. వడోదర, పలన్‌పూర్, వల్సాద్, సబర్మతి నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏ ట్రైన్ ఏ రోజు బయల్దేరుతుందో షెడ్యూల్‌లో తెలిపింది.

Advertisment
తాజా కథనాలు