Food Delivery Apps: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్.. ఇలా చేస్తే డబ్బులు మిగులుతాయి.. 

ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం విషయంలో  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు. ఫుడ్ డెలివరీ యాప్స్ మెంబర్ షిప్ తీసుకోవడం, డైనింగ్ క్రెడిట్ కార్డు తీసుకోవడం.. ఒకే యాప్ నుంచి కాకుండా వేర్వేరు యాప్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం డబ్బును ఆదా చేస్తాయి. 

Food Delivery Apps: ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్.. ఇలా చేస్తే డబ్బులు మిగులుతాయి.. 
New Update

Food Delivery Apps: ఆఫీసు పనిలో బిజీగా ఉన్నారు. ఇంటికి వచ్చేసరికి బాగా అలసిపోయారు. బాగా ఆకలి వేస్తోంది. వంట చేసుకునే పరిస్థితి లేదు. సర్లే ఎదో ఫుడ్ ఆర్డర్ చేద్దామని ప్రయత్నం చేశారు. బిర్యానీ చెప్పుకుంటే పోతుంది కదా అనుకున్నారు.. ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ 450 రూపాయలు ఉంది. నాలుగు రోజుల క్రితం అదే హోటల్ నుంచి తెప్పించుకున్న బిర్యానీ 280 రూపాయలే. అదేమిటీ అని ఆలోచించే పరిస్థితి లేదు. వేరే ఏది చూసినా వాటి ధరలూ అలానే కనిపిస్తున్నాయి. ఏం చేస్తారు.. లేని ఓపిక తెచ్చుకుని ఎదో ఒకటి వండేసుకుని ఆ పూట గడిపేస్తారు. అంతేకదా. అంతకు మించి చేయడానికి కూడా ఏమీ లేదు. ఎందుకంటే, ద్రవ్యోల్బణ పరిస్థితిలో ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండడం చాలా సహజం. ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా దానికి అతీతం కాదు. ఎందుకంటే, డెలివరీ చార్జీలు పెరుగుతూనే ఉంటాయి. అసలు ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం వలన ఎన్ని రకాల చార్జీలు చెల్లించాల్సి ఉంటుందో తెలుసా?

డెలివరీ ఛార్జీలు (Delivery Charges), డిస్టెన్స్ ఛార్జీలు, పీక్ అవర్స్‌లో పెరిగే చార్జీలు ఇవన్నీ కూడా మీ ఫుడ్‌ ధరను పెంచుతాయి. ఇక వర్షాల సమయంలో అదనపు ఛార్జీలు ఉంటాయి. అందుకే ఫుడ్ ఆర్డర్ చేసే ముందు అన్ని ఛార్జీలను చెక్ చేసుకోవాలి. 

అంతేకాదు కస్టమర్ల నుంచి ప్యాకింగ్, GST ని కూడా వసూలు చేస్తాయి ఫుడ్‌ కంపెనీలు. వీటన్నింటి కారణంగా మీరు ఆఫ్‌లైన్ ఆర్డర్ కంటే ఆన్‌లైన్ డెలివరీ కోసం 10-25% ఎక్కువ చెల్లింల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. 

మరి ఇటువంటి చార్జీల భారం ఎక్కువ పడకుండా ఫుడ్ ఆర్డర్ చేయలేమా? అని మీరడిగితే దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి వలన ఫుడ్ ఆర్డర్ చేసినపుడు బాగా డబ్బులు మిగులుతాయని చెప్పలేం కానీ, కొంత వరకూ డబ్బును ఆదాచేసుకోగలుగుతాము. 

అన్నిటికన్నా మొదటిది  మీరు ఆకలితో ఉన్నప్పుడు ఫుడ్‌ ఆర్డర్‌ చేసే ముందు ఛార్జీల వివరాలను గమనించండి. అందులో ఎన్ని ఛార్జీలు ఉన్నాయో చూడటం ముఖ్యం. ఇష్టం వచ్చినట్టు ఛార్జీలు విధించిన యాప్(Food Delivery Apps) నుంచి ఆర్డర్స్ పెట్టుకోకపోవడం మంచిది. 

Also Read: హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. !

ఇక రెండవది.. ఎప్పుడూ కేవలం ఒక యాప్‌పై ఆధారపడవద్దు. విభిన్న యాప్‌లను ఉపయోగించడం ఉత్తమం. మీరు ఒకే యాప్ ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటె కనుక మీకు డిస్కౌంట్స్.. ప్రోమో కోడ్ వంటి వెసులుబాటు లభించదు. 

ఇక మూడవ ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు క్రమం తప్పకుండా ఇలా ఫుడ్ ఆర్డర్ చేసుకునే పరిస్థితిలో ఉంటె మీరు డైనింగ్ క్రెడిట్ కార్డ్‌ని తీసుకోవడం బెటర్. హెచ్‌డిఎఫ్‌సి (HDFC), ఐసిఐసిఐ, సిటీ బ్యాంక్ వంటి అన్ని ప్రధాన బ్యాంకులు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ల కోసం ప్రత్యేకంగా క్రెడిట్ కార్డ్‌ను అందిస్తాయి. ప్రతి ఆర్డర్‌తో మీరు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ పొందుతారు. ఇది కాకుండా మీరు ఇతర షాపింగ్‌లో పొందే రివార్డ్‌లను ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఉపయోగించవచ్చు.

డబ్బు ఆదా చేయడానికి మరో మార్గం కూడా ఉంది. మీరు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తున్నట్లయితే మీరు ఈ యాప్‌ల మెంబర్ షిప్  కూడా తీసుకోవచ్చు. దీంతో స్టాండర్డ్ ధరల కంటే తక్కువ ధరల్లో మీకు ఫుడ్ దొరుకుతుంది. అంతేకాదు.. డెలివరీ ఛార్జీల వంటివి ఉండకపోవచ్చు.  తరచుగా ఫుడ్ ఆర్డర్ చేసే వ్యక్తులకు ఇది మంచిది. చివరి పాయింట్ చెల్లింపులు బ్యాంక్ ఎకౌంట్ నుంచి నేరుగా చేయకూడదు. మీరు UPI, కార్డ్ పేమెంట్, ఈ-వాలెట్ ద్వారా చెల్లించినట్లయితే మీరు డిస్కౌంట్లను పొందవచ్చు. అందుకే అందుబాటులో ఉన్నప్పుడల్లా అటువంటి డిస్కౌంట్స్ ను ఉపయోగించడం మంచిది.

Watch this interesting Video:

#food-delivery #online-food
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe