/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Some-research-shows-that-eating-chilies-can-help-you-live-longer-1-jpg.webp)
Chili Recipe : వంటల్లో కారం(Chilli) ముఖ్యమైనది. దీన్ని వేయడం వల్ల వంటలకు రుచితో పాటు ఆరోగ్యం(Health) కూడా బాగుంటుంది. పౌరుషానికి ప్రతీకగా కారాన్ని పిలుస్తారు. అయితే కారం ఎక్కువగా తింటే అల్సర్, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. గ్యాస్ సమస్య ఉన్నవారు, చిన్నపిల్లలు కారం తింటే విరేచనాలు అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కారం వల్ల కొందరికి లాభం ఉంటే..కొంత మంది వ్యక్తులకు నష్టం కూడా ఉంటుంది.
కారం తింటే ఎక్కువ కాలం జీవించవచ్చని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కారం తినడం వల్ల కడుపులో మంట వస్తుందని, పేగులకు పుండ్లు అవుతాయని, గ్యాస్ట్రిక్ సమస్య(Gastric Problems) లతో పాటు గుండెల్లో మంటగా ఉంటుందని కొందరు చెబుతుంటారు. కారం, ఉప్పు(Salt) తగ్గించి తినాలని కూడా సూచిస్తుంటారు. చప్పగా తినేవారి కంటే కారం ఎక్కువ తినేవారే ఎక్కువ రోజులు బతుకుతారని శాస్త్రవేత్తలు అంటున్నారు. చైనాలో చేసిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కారం, మిరియాలు తినేవారిలో చనిపోయే సంఖ్య తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగని రోజూ గొడ్డుకారం వేసుకుని లాగిస్తే మంచిది కాదంటున్నారు. వారానికి 2 సార్లు మాత్రమే కారం తినే వారితో పోలిస్తే రోజూ కారం వాడేవారిలో మరణాల రేటు 10 శాతమే ఉంటుందని అంటున్నారు. ఆడవాళ్లకైనా మగవాళ్లకైనా ఒకేలా ఉంటుందని అంటున్నారు. ఎండుకారం వాడటం కంటే పచ్చిమిర్చితో ప్రయోజనాలు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాంతాన్ని బట్టి, అలవాట్లను బట్టి ఉంటుందని, దేనినైనా మితంగా తింటేనే మేలు అని కొందరు వైద్యులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నొప్పులు ఉన్న మసాజ్ చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఎందుకంటే..?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.