రైలు కింద పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

తొలి ఏకాదశి పండుగ కోసం ట్రైన్‌లో ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫోన్‌ను దొంగలు కర్రతో కొట్టి చోరీ చేయాలనుకున్నారు. దాన్ని అందుకునే క్రమంలో రైలు నుంచి పడి మరణించాడు. శ్రీకాంత్ మరణంతో కుటుంబంలో.. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

New Update
రైలు కింద పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

software employee died after falling under a train

హన్మకొండ జిల్లా కమలాపూర్ ​మండలంలోని నేరెళ్లకు చెందిన ముప్పు రాములు, ధనమ్మ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు శ్రీకాంత్ ఉన్నారు. వ్యవసాయదారులైన రాములు దంపతులు కష్టపడి శ్రీకాంత్‌​ను చదివిపించారు.

ప్రాణం తీసిన ఫోన్

అయితే.. వారు అనుకున్నట్లుగానే శ్రీకాంత్ చదువు పూర్తి చేసి హైదరాబాద్​ ఇన్పోసిస్‌​లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా జాబ్ సంపాదించాడు. హైదరాబాద్‌లోనే ఉంటున్న శ్రీకాంత్​ తొలి ఏకాదశి పండుగ కోసం సికింద్రాబాద్ ​నుంచి​ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ఖాజీపేటకు బయలుదేరి వెళ్లాడు. ట్రైన్‌లో రష్ ​ఎక్కువగా ఉండడంతో డోర్​ దగ్గర మెట్లపై కూర్చొని ఫోన్​ చూస్తున్నాడు. బీబీనగర్ ​రైల్వేస్టేషన్ ​దాటిన తర్వాత కింద ఉన్న కొందరు అతడి చేతిని కర్రతో కొట్టారు. దీంతో కింద పడబోతున్న ఫోన్‌​ను పట్టుకోబోయిన శ్రీకాంత్​ రైలులో నుంచి కింద జారీపడి తీవ్ర గాయాలతో చనిపోయాడు.

బీ-కేర్‌ఫుల్

ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతుడు శ్రీకాంత్ ఫోన్‌ను కర్రతో కొట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ట్రైన్‌లలో ప్రయాణిస్తున్నడు తరుచు ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రైలు డోర్ దగ్గర కూర్చొకూడదని రైల్వే అధికారులు వెల్లడిస్తున్న ప్రయాణికులు మాత్రం తమ తీరును మార్చుకోవడం లేదు.

Advertisment
Advertisment
తాజా కథనాలు