శీతల పానీయాలు తాగడం వల్ల క్యాన్సర్ వస్తుందా? అవును..కూల్ డ్రింక్స్ తాగితే అనారోగ్య సమస్యలతోపాటు క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుందని…WHO చేసిన ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. వాస్తవానికి, ప్రపంచంలోని అత్యంత సాధారణ కృత్రిమ స్వీటెనర్లలో ఒకటైన అస్పర్టమే క్యాన్సర్‌కు కారణం అవుతుందని పరిశోధకులు తెలిపారు. ఇది మాత్రమే కాదు అస్పర్టమే క్యాన్సర్ కు కారకమని జులైలో WHO అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వచ్చిన ఈ నివేదిక ప్రకారం, సోడా, కోకా-కోలా వంటి శీతల పానీయాలు, చూయింగ్ గమ్ కొన్ని స్నాపిల్ పానీయాల వరకు ఉపయోగించే అస్పర్టమే శరీరంలో క్యాన్సర్ కణాలను ప్రేరేపించగలదని సూచిస్తుంది. దీనికి సంబంధించి, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC)…మీరు అస్పర్టమే కలిగిన తక్కువ లేదా ఎక్కువ ఉత్పత్తులను తీసుకున్నా, అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని చెబుతోంది.
అస్పర్టమే అంటే ఏమిటి? క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
అస్పర్టమే అనేది ఇదొక కృత్రిమ స్వీటెనర్ . వాస్తవానికి మిథైల్ ఈస్టర్ అని పిలువబడే సేంద్రీయ సమ్మేళనం. ఇది సాధారణ గ్రాన్యులేటెడ్ చక్కెర కంటే 200 రెట్లు తియ్యగా ఉంటుంది. 1981లో తక్కువ కేలరీల స్వీటెనర్‌గా మార్కెట్‌లోకి వచ్చింది. ఇది C14H18N2O5.. దీనిని షుగర్ ఫ్రీ అని కూడా పిలుస్తారు.
కానీ, అప్పటి నుండి దాని ఆరోగ్య సంబంధిత ప్రతికూలతల గురించి ఎన్నో విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. 2017లో, న్యూట్రిషనల్ న్యూరోసైన్స్‌లోని పరిశోధకులు ఇది మీ నరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని హెచ్చరించారు. ఇది తలనొప్పి, మూర్ఛలు, మైగ్రేన్‌లు, చికాకు కలిగించే మానసిక స్థితి, ఆందోళన, నిరాశ, నిద్రలేమితో సహా ప్రవర్తనా, అభిజ్ఞా సమస్యలకు దారితీస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇది కాకుండా, శరీరంలోని వివిధ మార్పుల రూపంలో బయటకు వచ్చే కొన్ని క్యాన్సర్ కణాలను కూడా ఇది ప్రేరేపిస్తుందని వెల్లడించారు.
ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు..
ఆస్పర్టమేపై ఫ్రాన్స్‌లో సుమారు లక్ష మంది చిన్నారులపై సంవత్సరంపాటు పరిశోధనలు జరిపారు. రామజ్జని ఇన్‌స్టిట్యూట్ ఎలుకలపై ఆస్పర్టమే ప్రభావం గురించి రెండు ధపాలుగా పరిశోధనలు చేసింది. అయితే నిపుణుల కమిటీ జూన్ నెలాఖరులో దీనిపై సమీక్షించింది.