Twitter Down: ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ ట్విట్టర్ (X) సేవలకు అంతరాయం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ సేవలు నిలిచిపోయాయి. అమెరికా దాదాపు 27,000 మంది తాము పోస్ట్ చేస్తుంటే ఎక్స్ లో పోస్ట్ అవ్వడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం, X మంగళవారం చివరిలో అంతరాయాలను ఎదుర్కొంది. డౌన్‌డెటెక్టర్, వినియోగదారులతో సహా అనేక మూలాల నుండి స్టేటస్ రిపోర్ట్‌ల ద్వారా అంతరాయాలను ట్రాక్ చేశామని.. అమెరికాలో 27,700 కంటే ఎక్కువ అంతరాయ ఏర్పడినట్లు తెలుస్తోందని పేర్కొంది. కాగా ఎలాన్ మస్క్ ట్విట్టర్ సంస్థను కొనుగోలు చేసుకున్న తరువాత ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూ వస్తున్నాయి. అయితే, ఈ సాంకేతిక లోపలకు మాత్రం మస్క్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదే నెలలో ట్విట్టర్ డౌన్ కావడం ఇది రెండో సారి.
Aakhir jab Twitter (X) down hota hai toh usi time is down ke baare me post kaha Karu?🤔#TwitterDown #X pic.twitter.com/I8Mb6UxfX9
— Randhir (रणधीर) (@K_Randhir) August 28, 2024
మాకు ట్విట్టర్ పని చేస్తోంది..
ట్విట్టర్ లో ప్రస్తుతం 'ట్విట్టర్ డౌన్' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అయితే కొన్ని దేశాల్లో ట్విట్టర్ డౌన్ కాగా.. తమకు ట్విట్టర్ పనిచేస్తోందని మరికొందరు అనే ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. తాము అన్ని ఎక్స్ లో పోస్ట్ చేయగలుగుతున్నామని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. మరోవైపు మరి కొంత మంది తాము పోస్ట్ చేస్తే చేయడానికి రావట్లేదని.. రిఫ్రెష్ అవడం లేదని.. పోస్ట్ కాకపోతే ఫోన్ సమస్య అనుకున్నాం కానీ, ట్విట్టర్ డౌన్ అయిందని తెలీదని ట్వీట్లు చేస్తున్నారు. కాగా ఎలాన్ మస్క్ కొన్నాకే ట్విట్టర్ డౌన్ అవ్వడం మొదలైందని మరికొంత విమర్శలు గుప్పిస్తున్నారు.
People checking Twitter search to see whether twitter is down lol😂#TwitterDown #twitterdownrecovery pic.twitter.com/2FJnotpdyY
— Revanth Reddy🇮🇳 (@Revanth97574593) August 28, 2024
lol thought it was just my internet but twitter was actually down 🤣
— chloe🗡️ (@kchloegf) August 28, 2024