Tollywood Vs Bollywood : బాలీవుడ్.. మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? సోషల్ మీడియాలో బాలీవుడ్ Vs టాలీవుడ్ వార్

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ -ప్రభాస్ వివాదంతో సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వార్ మొదలైంది. టాలీవుడ్ ను అనేటప్పుడు మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? కల్కి క్లైమాక్స్ లోప్రభాస్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు మీకు' అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

Tollywood Vs Bollywood : బాలీవుడ్.. మీ బతుకులేంటో తెలుసుకోండి, ప్రభాస్‌ని అనే రేంజా మీది? సోషల్ మీడియాలో బాలీవుడ్ Vs టాలీవుడ్ వార్
New Update

Tollywood Vs Bollywood : బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఇటీవల ప్రభాస్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీనిపై టాలీవుడ్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. రీసెంట్ గా అర్షద్ ఓ ఇంటర్వ్యూలో కల్కి సినిమా తనకు నచ్చలేదని, సినిమాలో ప్రభాస్ ఓ జోకర్ లాగా కనిపించాడని కామెంట్స్ చేశాడు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

ఇప్పటికే ఈ వివాదంపై సిద్దు జొన్నలగడ్డ, నాని, మంచు విష్ణు, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో పాటూ పలువురు నిర్మాతలు స్పందిస్తూ అర్షద్ వ్యాఖ్యలను తప్పు బట్టారు. అయితే ఈ వివాదంతో సోషల్ మీడియాలో టాలీవుడ్, బాలీవుడ్ మధ్య వార్ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి పొందిన తెలుగు సినిమా గురించి, అందులోనూ ప్రభాస్ లాంటి హీరో గురించి మీ బాలీవుడ్ వాళ్ళు మాట్లాడుతున్నారా?

Also Read : ప్రభాస్ – అర్షద్ వివాదంపై స్పందించిన ‘కల్కి’ డైరెక్టర్.. ఏమన్నాడంటే?

టాలీవుడ్ ను అనేటప్పుడు మీ బతుకులేంటో ఒక్కసారి తెలుసుకోండి, కల్కి క్లైమాక్స్ లోని ప్రభాస్ ఎంట్రీ సీన్ ఒక్కటి చాలు మీ బాలీవుడ్ వాళ్లకు.. అలాంటి టేకింగ్ మీ బాలీవుడ్ వల్ల అవుతుందా? మీకు దమ్ముంటే కల్కి లాంటి సినిమా తీయండి, గత కొన్నాళ్లుగా మీ బాలీవుడ్ హీరోలే మా టాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు..

మీ హీరోయిన్స్ మా తెలుగు హీరోలతో జత కడుతున్నారు. అది మా టాలీవుడ్ రేంజ్.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటూ చాల మంది నెటిజన్స్ బాలీవుడ్ పై ఫైర్ అవుతూ రక రకాల పోస్టులు పెడుతున్నారు. ఇక కొందరేమో అర్షద్ వార్సీ తరుపున వాదిస్తూ ..' అతను సెల్ఫ్ మేడ్ స్టార్ అని, ప్రభాస్ కన్నా గొప్ప నటుడని కామెంట్స్ చేస్తున్నారు.

#prabhas-arshad-controversy #tollywood-vs-bollywood
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe