AP politics: దమ్ముగా తల ఎత్తుకునేలా చేశారు: మంత్రి జోగి రమేశ్‌

వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో చెప్పాలని నారా భువనేశ్వరిపై మండిపడ్డారు మంత్రి జోగి రమేశ్‌. నిజం గెలిచింది.. నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని విరుచుకుపడ్డారు. ఇక తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి సామాజిక సాధికార బస్సుయాత్ర ప్రారంభమైయింది. జెండా ఊపి బస్సు యాత్రను రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మంత్రులు ఆదిమూలపు సురేశ్‌, జోగి రమేశ్‌ ప్రారంభించారు

New Update
AP politics: దమ్ముగా తల ఎత్తుకునేలా చేశారు: మంత్రి జోగి రమేశ్‌

గుంటూరులో మంత్రి జోగి రమేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోస్తాంధ్రలో మొట్టమొదటిసారిగా సామాజిక యాత్ర భేరి మోగించబోతుందన్నారు. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సామాజిక ధర్మాన్ని జగన్ పాటించారన్నారు. నాలుగున్నరేళ్లలో దమ్ముగా మేం తల ఎత్తుకునేలా చేశారన్నారు రమేశ్‌. మాకు జగన్ అనే ఒకే ఒక్క నాయకుడున్నాడని సీఎంపై ప్రశంసల వర్షం కురిపించారు. సామాజిక సాధికారిత ద్వారా 175 నియోజకవర్గాల్లో మాకు జరిగిన మేలును వివరిస్తామని తెలిపారు. చంద్రబాబు పాపం పండిందని.. 40 ఏళ్లలో చేసిన అవినీతి బయటపడిందని మంత్రి విమర్శించారు.

నారా భువనేశ్వరి నిజం గెలవాలంటూ రోడ్డెక్కారని.. నిజం గెలిచింది.. నిజం నిగ్గు తేలింది.. కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడని ఆయన విరుచుకుపడ్డారు. 40 ఏళ్లలో చంద్రబాబు వెన్నంటే ఉన్న మీరే చంద్రబాబు పాపాలు చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. వెన్నంటే ఉండి మీ తండ్రికి ఎలా వెన్ను పోటు పొడిచాడో మీరు చెప్పాలని నారా భువనేశ్వరికి సవాల్‌ చేశారు. రెండు ఎకరాలతో రెండు లక్షలు ఎలా దోచుకున్నారో మీరు చెప్పాలన్నారు. పేదల కోసం జగన్ ఏం చేశారో మేం చెబుతాం అని..మీరు రెఢీనా..? అంటూ సవాల్‌ విసిరారు.

రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కారు:

మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ.. అనునిత్యం ప్రజల వద్దకే పాలన అనేది సీఎం జగన్ ఆలోచన అన్నారు. ఈ నాలుగున్నరేళ్లలో బడుగు, బలహీన వర్గాల స్థితి గతులు ఎలా మారాయో ఈ యాత్రలో చెబుతామన్నారు. పేదలకు జరిగిన మేలును చెప్పేందుకు మేం యాత్ర చేస్తున్నామన్నారు ఆదిమూలపు సురేష్. ఓ రిమాండ్ ఖైదీ కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందన్నారు. తమ వ్యాపారాల కోసం.. గుట్టు బయటపడకుండా ఉండాలనేదే వారి తాపత్రయం అని ఆరోపించారు. కుంభకోణాలతో చంద్రబాబు అవినీతి పాలన అందించారని విమర్శలు చేశారు. అవినీతి లేకుండా జవాబుదారీగా పాలనను జగనన్న అందించారని చెప్పారు. జగనన్న తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలకు వివరిస్తామని మంత్రి వెల్లడించారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం అవసరమా..? అని ఒకరంటారు. యూ ట్యూబ్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చని మరొకరంటారు. పవన్ కళ్యాణ్‌కు దమ్ముంటే మా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలతో పోటీగా ఇంగ్లీష్ మాట్లాడాలని సవాల్ చేశారు. జగన్ రాష్ట్రంలో ఏ ఒక్క ఉపకులాలను కూడా విస్మరించకుండా న్యాయం చేశారని మంత్రి తెలిపారు. మీకు మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్నామని ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఇది కూడా చదవండి: పొంగులేటికి కాంగ్రెస్ బిగ్ షాక్! ఆస్థానంలో పోటీకి ఊహించని నేత..!

Advertisment
Advertisment
తాజా కథనాలు