Snake in Pant: యువకుడి ఫాంట్ లో దూరిన పాము.. ఏమి జరిగిందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ 

పామును చూస్తేనే అందరికీ పై ప్రాణాలు పైనే పోతాయి. అదే పాము మన శరీరంపై పాకితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ఆ పాము మన దుస్తులలో దూరకూడని ప్రాంతాలలో దూరితే ఏమవుతుంది? ఇదిగో ఇలానే నిద్రపోతున్న ఒక యువకుడి ఫాంట్ లోకి పాము దూరింది. అప్పుడేమైందో ఈ వీడియోలో చూడొచ్చు. 

Snake in Pant: యువకుడి ఫాంట్ లో దూరిన పాము.. ఏమి జరిగిందో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్ 
New Update

Snake in Pant:  సాధారణంగా వర్షాకాలంలో రకరకాల వ్యాధులతో పాటు ఊర్లలో పాముల బెడద కూడా పెరుగుతుంది. పల్లెటూర్లలో పాముల కాటుకు బాలయ్యేవారి సంఖ్యా వర్షాకాలంలో ఎక్కువగానే ఉంటుంది.  పాము ఎదురైతే పక్కకు తప్పుకుని పారిపోయే ప్రయత్నం చేయవచ్చు. కొంచెం ధైర్యం ఉన్నవాళ్లు దానిని కొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ, ఎక్కువ శాతం పామును చూస్తేనే భయంతో పరుగులు తీసే ప్రయత్నం చేస్తారు. అయితే, ఒక పాము.. నిద్రపోతున్న ఒక యువకుని నిక్కరు (షార్ట్) లోకి దూరింది. అప్పుడు ఏమి జరిగి ఉంటుందో ఊహించడానికే భయం వేస్తోంది కదూ. 

Snake in Pant:  ఇంట్లో సోఫాపై ప్రశాంతంగా నిద్రిస్తున్న ఓ యువకుడి వద్దకు పాము వచ్చి ప్యాంట్‌లోకి ఎక్కిన ఘటన థాయ్‌లాండ్‌లోని రేయాంగ్‌లో చోటుచేసుకుంది. దీంతో భయపడిన యువకుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా పాములను పట్టుకునే వారికి మెసేజ్ పంపించి.. కదలకుండా అలానే పడుకున్నాడు. తరువాత కొద్దిసేపటికి ఆ పాములు పెట్టె అతను వచ్చి పామును జాగ్రత్తగా పట్టుకున్నాడు.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

Snake in Pant:  ఈ సంఘటన గురించిన పోస్ట్‌ను @unikinfold ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో, "థాయ్‌లాండ్‌లోని రేయోంగ్ ప్రావిన్స్‌లో మనిషి ప్యాంటు లోపల పాము కనిపించింది" అనే శీర్షికతో షేర్ చేశారు.  

ఆ పోస్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు..

Snake in Pant:  వైరల్ వీడియోలో, ఒక యువకుడు మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని ప్యాంటులో ఒక చిన్న నాగుపాము దూరింది. దీంతో ఆటను కదలకుండా కొద్దిసేపు బిగుసుకుపోయి అలానే పడి ఉన్నాడు. ఆ తరువాత పాములను పట్టే నిపుణుడు వచ్చి యువకుడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పాము హుక్ సహాయంతో పామును జాగ్రత్తగా బయటకు తీశారు.

Snake in Pant:  5 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 3.5 మిలియన్ల వీక్షణలు వచ్చాయి.  నెటిజన్లు పాము దాచడానికి వేరే స్థలం దొరకలేదా అని ఫన్నీ కామెంట్స్ రాశారు.

#viral-video #snake
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe