AP Smugglers: తిరుపతిలో రెచ్చిపోయిన స్మగ్లర్లు.. భారీగా ఎర్రచందనం స్వాధీనం తిరుపతి జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ ఫారెస్ట్‌లో అక్రమాలకు పాల్పుడుతున్నారు. పక్క సమాచారంలో రెండు ప్రాంతాలలో టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడుతుకు చెందిన పలువురి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. By Vijaya Nimma 12 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Red Sanders Smugglers in AP: తిరుపతిలో (Tirupati) టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 25 మంది తమిళనాడుకు (Tamilnadu) చెందిన స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు మూడు వాహనాల సీజ్ చేశారు. లక్షల విలువైన 21 ఎర్రచందనం దుంగల స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం. తిరుపతి జిల్లాలోని రెండు వేర్వేరు ఘటనలో 25 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లా రెడ్డివారిపల్లి ఫారెస్ట్ పరిధిలోని పెద్దకోనవంక దగ్గర ఘటన జరగగా.. కర్నూలు జిల్లా చాగలమర్రి దగ్గర మరో ఘటన చోటుచేసుకుంది. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. గురువారం నాడు మూడు వాహనాలు రావడంతో సిబ్బందిని ఆపేశారు. వాహనాలను తనిఖీ చేయగా 21 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. వాహనంతోపాటు లక్షలు విలువ చేసే ఎర్రచందనం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో నిందితులపై కేసు పట్టుబడిన నింధితులపై గతంలో పీడియాక్ట్ నమోదైన వారే ఉన్నారని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసులు (Tirupati Task Force) వెల్లడించారు. పీడీ యాక్ట్ తరువాత కూడా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడితే ఆస్తులను సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. అయినా పోలీసుల పట్టించుకోకుండా..ఎర్రచందనంను ఎక్కువగా తరలిస్తున్నారు. ఈ స్మగ్లర్లు ఎక్కువగా తమిళనాడు రాష్ట్రం నుంచే ఇప్పటికీ ఎక్కువగా వస్తున్నారని తెలిపారు. అయితే.. శేషాచలం అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయినా.. బెంగళూరు నుంచి వయా అనంతపురం మీదుగా నంద్యాల వైపు చేరుకుని శేషాచలం అటవీ ప్రాంతంలోకి స్మగ్లర్లు చేరుకుంటున్నారు పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ ఏపీలో స్మగ్లర్ల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాం తిరుపతి ఆపరేషన్ ట్రాన్స్ ఫోర్స్ డీఎస్పీ చెంచుబాబు తెలిపారు. మరోవైపు ఫారెస్ట్‌లలో తలదాచుకున్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు అటవిశాఖ అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం తరలింపుపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఇంకా నిందితుల ఉంటే త్వరలోనే పట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నింధితుల వివరాల ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. స్మగ్లర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇది కూడా చదవండి: అత్తను తుపాకితో కాల్చి చంపిన కానిస్టేబుల్.. హనుమకొండ జిల్లాలో కాల్పుల కలకలం #red-sandalwood #tirupati-task-force #smugglers-in-ap మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి