smartphone usage: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం రోజుకు 5 గంటలు మించితే ఏమవుతుంది..?

ఇప్పుడు ప్రపంచంలో ఎటు చూసినా స్మార్ట్‌ఫోన్ల హవా నడుస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఇంట్లో నీళ్లు లేకుండా అయినా ఉంటాం.. కానీ, ఇంటర్ నెట్ లేకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశాం. తిండి లేకున్నా సరేకానీ మొబైల్‌లో డేటా ప్యాక్‌ లేకుండా నెటిజన్లు ఉండలేకపోతున్నారు.

Tech Tips: ఫోన్ పాడైపోయిందని సర్వీస్ సెంటర్‌లో ఇస్తున్నారా? ముందు ఇది తెలుసుకోండి..
New Update

smartphone usage: దేశంలోని అనేక ప్రాంతాలు 2జీ నుంచి 3జీకి ఎప్పుడో అప్‌డేట్ అయిపోయాయి. నగరాలన్నీ 3జీ నుంచి 4జీలోకి మారిపోయాయి. ఇక ఐదోతరం 5జీ నెట్‌వర్క్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ ఏడాది చివర్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 5జీ వేగాన్ని అందుకోవాలంటే 5జీ టెక్నాలజీ ఉన్న స్మార్ట్ ఫోన్లు తప్పనిసరి. మొబైల్ తయారీ కంపెనీలు సైతం 5జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీపడుతున్నాయి.

ఇది కూడా చదవండి:  ప్రధాని మోదీ రోజూ చేసే పనులు ఇవే

5జీతో కేవలం నెట్ స్పీడ్ మాత్రమే పెరుగుతుందనుకుంటే పొరపాటే. ఈ హైస్పీడ్ కనెక్టివిటీ సమాచార స్వరూపాన్నే మార్చబోతోంది. డ్రైవర్ లెస్ కార్లు రోడ్లపై పరుగులు పెట్టవచ్చు. వేల కిలోమీటర్ల దూరంలో పేషెంటుకు డాక్టర్లు సర్జరీలు చేయవచ్చు. ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు. ఇలా 5జీ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే సమస్యలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. మన జీవితం ఇంటర్నెట్‌తో కనెక్ట్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ విషయంలో మరింత జాగ్రత్త ఉండాలని, వైరస్, డేటా థెప్ట్, హ్యాకింగ్ బారిన పడితే జీవితాలు రోడ్డున పడినట్లేనని హెచ్చరిస్తున్నారు.

మూగ జీవాలకు మాత్రం శాపమేనంటున్నారు

5జీ డేటాతో హ్యాకర్లు సులభంగా డేటాను చోరీ చేసుకోగలరని, ఎయిర్‌వేవ్స్ ద్వారా కాల్స్, డెక్ట్స్ సందేశాల డేటాను సులభంగా కాజేస్తారని బెర్లిన్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్ల నుంచి డేటాను సులభంగా దోచుకునేందుకు ఈ నెట్‌వర్క్ సులభంగా వుంటుందని పరిశోధనలో తెలింది. ఫ్యాక్టరీల్లో కూడా ఆటోమేషన్ పెరగడం వల్ల లక్షల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉంది. 5జీ టెక్నాలజీ వల్ల మనిషి జీవితంలో వేగం పెరగొచ్చు కానీ మూగ జీవాలకు మాత్రం శాపమేనంటున్నారు పర్యావరణ నిపుణులు. 5జీ వల్ల వెలువడే రేడియేషన్‌తో పక్షి జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నెదర్లాండ్స్ రాజధాని హేగ్‌లోని ఓ పార్క్‌లో కొంతకాలంగా పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఆందోళన చెందిన పక్షి ప్రేమికులు కారణాలపై అన్వేషించగా వారికి షాకింగ్ విషయం తెలిసింది. 5జీ టెస్ట్ సిగ్నల్‌ రేడియేషన్ వల్లనే వందలాది పక్షులు చనిపోతున్నాయని గుర్తించారు. ఇప్పటికే సెల్‌ఫోన్ రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోయాయి. కేవలం 4జీ టెక్నాలజీ వల్లే ఇంత వినాశనం జరిగితే.. రాబోయే 5జీ సిగ్నల్ రేడియేషన్ ఎంత ముప్పు తీసుకురాబోతుందనేది ఆందోళన కలిగిస్తోంది.

#usage-exceeds-5-hours #smartphone
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe