/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-35-jpg.webp)
Smokey Biscuits: స్మోక్ బిస్కెట్ తిని ఓ బాలుడు మృతిచెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లిక్విడ్ నైట్రోజన్ తో కూడిన ఈ బిస్కెట్ తిన్న సెకన్లలోనే పిల్లవాడు కడుపులో నొప్పి అంటూ అల్లాడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
दुखद
कृपया जब आप अपने बच्चों को स्नैक्स खिलाने के लिए ले जाएं तो सावधान रहें।
दुःख की बात है कि बच्चा अब जीवित नहीं है 😞हे भगवान! pic.twitter.com/9Dza7gYhmV
— हम लोग We The People 🇮🇳 (@ajaychauhan41) April 20, 2024
నొప్పితో అరుస్తూ సహాయం కోరుతూ..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక చిన్న పిల్లవాడు పబ్లిక్ ఏరియాలోని స్టాల్‌లో బిస్కెట్లు తాగుతూ కనిపించాడు. అయితే ఆ పొగబెట్టిన బిస్కెట్ తినడం వల్ల కొన్ని క్షణాల్లోనే ఆ బాలుడు నొప్పితో అరుస్తూ సహాయం కోరుతూ కనిపించాడు. అతని ఆరోగ్యం క్షీణించినట్లు గమనించిన పేరెంట్స్ వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే పొగ బిస్కెట్లు తాగిన బాలుడు మృతి చెందినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Crime News : కడుపుతో ఉన్న భార్యను మంచానికి కట్టేసి, నిప్పంటించిన భర్త
కడుపులోకి చేరగానే ఊపిరాడనివ్వదు..
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. పొగబెట్టిన బిస్కెట్లను తినకూడదని చాలామంది తల్లిదండ్రులను కోరుతున్నారు. ఈ పానీయాలలో ద్రవ నైట్రోజన్ -196 డిగ్రీల సెల్సియస్ వద్ద చల్లబడి ఉంటుంది. ఇది కడుపులోకి చేరగానే ఊపిరాడనివ్వదు. ద్రవ నైట్రోజన్ మనుషులను చంపేస్తుంది. ఈ రకమైన స్మోకీ డ్రింక్స్ పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. బాలుడి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.