Prime Minister : మీటింగ్‌ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు!

స్లావేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్‌ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు.

New Update
Prime Minister : మీటింగ్‌ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు!

Slovakia : స్లావేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో(Robert Fico) పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు(Firing) జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్‌ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు. హౌస్ ఆఫ్ కల్చర్ బయట జరిగిన అధికారిక కార్యక్రమంలో రాబర్ట్ ఫికో మాట్లాడుతుండగా ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది.

దుండగుడు పలు రౌండ్లు కాల్పులు జరుపడంతో ప్రధాని కింద పడిపోయారని వార్తలొచ్చాయి. రాబర్ట్ ఫికోకు నాలుగు బుల్లెట్లు తగిలాయని ప్రభుత్వ అధికార చానెల్ తెలిపింది. అనుమానిత వ్యక్తిని ప్రత్యక్ష సాక్షులు పట్టుకున్నారు. ప్రధానిపై కాల్పులు జరుపడంతో ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అనుమానితుడ్ని అరెస్ట్ చేశారు.

దేశ ప్రధాని రాబర్ట్ ఫికోపై జరిగిన దాడిని అధ్యక్షుడు జుజానా కాపుటోవా తీవ్రంగా ఖండించారు. ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని రాబర్ట్ ఫికో.. రష్యా(Russia) అనుకూల విధానాన్ని అవలంభిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Also read: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు