Sleeping Habits: నిద్ర తక్కువైతే.. ఆయుష్షు కూడా తగ్గుతుంది..ఎలా అంటే.. 

మంచి నిద్ర మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. సరిగా నిద్ర పోలేని వ్యక్తుల ఆయుష్షు తగ్గుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నిద్ర తక్కువ అయితే అది చాలా అవయవాల పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగాలేని వారికి జ్ఞాపకశక్తి త్వరగా నశించిపోతుందని పరిశోధనల్లో తేలింది. 

Health Tips : రాత్రిళ్లు ఎక్కువగా ఫోన్ చూస్తున్నారా? అయితే మీకు ఈ ఐదు వ్యాధులు గ్యారెంటీ..!!
New Update

Sleeping Habits:  ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలి అని ఎవరినైనా అడిగితె ఏం చెబుతారు? సమయానికి భోజనం చేయాలి.. వ్యాయామం చేయాలి.. చెడు అలవాట్లు ఉండకూడదు.. ఇలా చెబుతారు అంతే కదా. ఇవన్నీ సరే.. మరి మంచి నిద్ర లేకపోతె ఏం జరుగుతుంది? దీనిగురించి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచిస్తారా? అసలు మంచి నిద్ర అంటే ఏమిటి? ఇది ఎంతమందికి తెలుసు? నిజం.. మంచి నిద్ర అంటే ఏమిటి అనేది చాలామందికి తెలియదు. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరం అని చెబుతారు. అది కూడా వయసును బట్టి మారుతుంటుంది. శిశువులు 4 నెలల నుంచి  12 నెలల శిశువులకు 24 గంటలలో  12 నుంచి 16 గంటలు, 1 నుంచి  2 సంవత్సరాల వరకు 11 నుంచి 14 గంటలు, 3 నుంచి 5 సంవత్సరాల వరకు10 నుంచి  13 గంటలు, 6 నుంచి 12 సంవత్సరాల వరకు 9 నుంచి 12 గంటలు.. 13 నుంచి 18 సంవత్సరాల వరకు 8 నుంచి 10 గంటలు ఇక పెద్దలకైతే   7 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్ర తప్పనిసరి. 

అలాగే నిద్రలో నాణ్యత కూడా ముఖ్యమైనదే. ఎదో పడకమీద దొర్లడం నిద్ర కాదు. నిద్ర పోయిన సమయంలో డీప్ స్లీప్ ఎంత ఉంది అనేది కూడా అవసరమే. 

ఇప్పటి లైఫ్ స్టయిల్ లో నిద్రకు ఎవరూ అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది వాస్తవం. ద్యూటీ సమయాలు.. బాధ్యతలు.. టెన్షన్స్ కారణంగా చాలామంది సరైన నిద్రకు దూరం అవుతున్నారు. కొంతమంది నిద్రపోవాల్సిన సమయంలో ఇతర విషయాల పై దృష్టి పెట్టి నిద్ర లేకుండా కాలం గడుపుతున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం.. నిద్ర పోవాల్సిన సమయంలో టీవీ లేదా ఫోన్ చూస్తూ కాలక్షేపం చేయడం అనారోగ్య కారకంగా మారుతుంది. 

నిద్ర లేకపోవడం వల్ల ఆయుష్షు  తగ్గుతుంది.. 

సరిపడా నిద్రలేకపోవడం(Sleeping Habits) వల్ల మన అవయవాలు దెబ్బతింటాయి.  అవి అకాల వృద్ధాప్యానికి దారితీస్తాయి. స్లీప్ రీసెర్చ్ సొసైటీ చేసిన ఒక అధ్యయనంలో 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం కూడా అకాల మరణ ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది. తగినంత నిద్ర లేకపోవడం శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె:
మన నిద్ర కూడా మన రక్తపోటు - కొలెస్ట్రాల్ స్థాయిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చేసిన పరిశోధనలో 7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తులకు రక్తపోటు - అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఈ పరిస్థితులు మన గుండెపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. అదేవిధంగా గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి.

మధుమేహం:
ఇలాంటి  చాలా రీసెర్చ్ లలో, నిద్ర లేకపోవడం(Sleeping Habits) మన రక్తంలో చక్కెర స్థాయిని కూడా ప్రభావితం చేస్తుందని - టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని కూడా గమనించారు. 

శరీర వ్యాధులతో పోరాడటానికి రోగనిరోధక శక్తికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రలో గాయాలు త్వరగా మానిపోతాయి. అంటువ్యాధులతో పోరాడటంలో నిద్ర కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో, శరీరానికి తగినంత నిద్ర లభించకపోతే, మన రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.

Also Read: బరువు తగ్గాలంటే బాగా నిద్రపోవాలట.. లేటెస్ట్ రీసెర్చ్ రివీల్డ్.. 

మెదడు:
మనం ఇప్పుడే అర్థం చేసుకున్నట్లుగా, మనం నిద్రను అనేక దశల్లో పూర్తి చేస్తాము. మెదడు వివిధ దశలలో భిన్నంగా పనిచేస్తుంది. అదేవిధంగా, జ్ఞాపకశక్తిని ఏర్పరచుకోవడానికి - విషయాలను గుర్తుంచుకోవడానికి గాఢ నిద్ర చాలా ముఖ్యం. మతిమరుపు వచ్చే ప్రమాదం కూడా తక్కువ నిద్రతో ముడిపడి ఉంటుందని అనేక పరిశోధనలలో గుర్తించారు. 

డిప్రెషన్
మన శరీరం చాలా సంక్లిష్టమైన వ్యవస్థ, దానిని పూర్తిగా అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. విషయాలు మనపై ఎలా ప్రభావం చూపుతాయి అనే దాని గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా పరిశోధనలో నిమగ్నమై ఉన్నారు. నిద్ర విషయంలో కూడా అదే పరిస్థితి. మన ఆరోగ్యంపై నిద్ర ప్రభావం ఇప్పటికీ పరిశోధనలో ఉంది.

దీని గురించి నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో కూడా ఒక పరిశోధన ప్రచురించారు. దీనిలో నిద్ర లేకపోవడం వల్ల శారీరకంగా అనారోగ్యానికి గురికావడమే కాకుండా మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని తేలింది. డిప్రెషన్ - తగినంత నిద్ర లేకపోవడం మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది అలాగే ఈ కలయిక కూడా చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే డిప్రెషన్‌ వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి. అదే సమయంలో, తగినంత నిద్ర లేకపోవడం వల్ల, డిప్రెషన్ మరింత పెరుగుతుంది.  ఇది ఒక విష చక్రం అవుతుంది. తక్కువ లేదా ఎక్కువ నిద్ర మనకు మంచిది కాదని ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు.

అవును, అనవసరంగా స్క్రీన్ ముందు కూర్చోవడానికి బదులు, కాస్త కునుకు తీసి, శరీరానికి, మనసుకు విశ్రాంతినిచ్చే అవకాశం ఇవ్వడం మంచిది.

Watch this interesting Video:

#health-tips #health
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe