Sleep Tips: నిద్రకు ముందు ఈ ఆరు పనులను అసలు చేయకండి..లేకుంటే రాత్రంతా జాగారమే..!

నిద్రవేళకు ముందు కొన్ని పనులకు దూరంగా ఉండాలి. నిద్రకు అంతరాయం కలిగించే ఆరు కార్యకలాపాలను తెలుసుకోండి. స్క్రీన్ సమయాన్ని తగ్గించండి. పడుకునేముందు గడియారాన్ని అదేపనిగా చూడవద్దు. ఆందోళన చెందవద్దు. భారీ భోజనం చేయవద్దు. తీవ్రమైన మానసిక కర్యకలాపాలకు దూరంగా ఉండండి.

Sleep Tips: నిద్రకు ముందు ఈ ఆరు పనులను అసలు చేయకండి..లేకుంటే రాత్రంతా జాగారమే..!
New Update

కొంతమందికి నైట్ అసలు నిద్రపట్టదు. అందుకు అనేక కారణాలుంటాయి. మీ నిద్ర నాణ్యత మీరు పడుకునేటప్పుడు మాత్రమే కాదు, దానికి దారితీసే గంటల్లో మీరు ఏమి చేస్తారనే దానిపై కూడా ప్రభావం చూపుతుంది. మీ సాయంత్రం దినచర్యలో కొన్ని నిద్ర-స్నేహపూర్వక అలవాట్లను చేర్చడం వల్ల మీ నిద్ర నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది. పుస్తకం చదవడం, లోతైన శ్వాసను తీసుకోవడం లేదా వెచ్చని నీటితో స్నానం చేయడం లాంటి వాటితో మీ స్లీప్ స్టైల్ మారుతుంది.

మీకు మంచి నిద్రకావాలంటే నిద్ర సమయానికి ముందు కొన్ని పనులకు దూరంగా ఉండండి. అవేంటో తెలుసుకోండి.

publive-image ప్రతీకాత్మక చిత్రం

1. స్క్రీన్ టైమ్

స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, కంప్యూటర్లు లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు విడుదల చేసే బ్లూ లైట్‌కి ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం మంచిదికాదు. ఇది మీ నిద్ర నాణ్యతను తగ్గిస్తుంది. మీ నిద్రను నియంత్రించే హార్మోన్ అయిన మెలటోనిన్ సహజ ఉత్పత్తికి బ్లూ లైట్‌ అంతరాయం కలిగిస్తుంది. నిద్రపోవడానికి కనీసం ఒక గంట ముందు స్క్రీన్లను నివారించాలని లక్ష్యంగా పెట్టుకోండి. వాటి జోలికి పోవద్దు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

2. వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం నిద్రకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ, నిద్రవేళకు దగ్గరగా తీవ్రమైన వ్యాయామాలు చేయడం కరెక్ట్ కాదు. ఇది మీ శరీరాన్ని అలసిపోయేలా చేస్తుంది. నిద్రపోవడాన్ని కష్టతరం చేస్తుంది. పగటిపూట తీవ్రమైన శారీరక కార్యకలాపాలను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. సాయంత్రం తర్వాత లైట్ ఎక్స్‌ర్‌సైజ్‌ మాత్రమే చేయండి.

3. భారీ భోజనం, కెఫిన్

నిద్రవేళకు ముందు పెద్ద, భారీ భోజనం లేదా కెఫిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం అజీర్ణానికి దారితీస్తుంది. మీరు నిద్రపోవడానికి చాలా గంటల ముందు కెఫిన్ కలిగిన పానీయాలు తీసుకోవద్దు. ఎక్కువ స్పైసీతో పాటు ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం పరిమితం చేయండి.

4. ఆల్కహాల్ వినియోగం

ఆల్కహాల్ ప్రారంభంలో మీకు మగత అనిపించినప్పటికీ, ఇది మీ స్లీప్‌ సైకిల్‌కి అంతరాయం కలిగిస్తుంది. నిద్రవేళకు దగ్గరగా మద్యం మానుకోండి. దీని వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.

publive-image ప్రతీకాత్మక చిత్రం

5. తీవ్రమైన మానసిక కార్యకలాపాలు

బెడ్‌ టైమ్‌కి ముందు పని సంబంధిత ప్రాజెక్టులు లేదా తీవ్రమైన చర్చలు లాంటి పనులు పెట్టుకోవద్దు. మానసికంగా స్ట్రెస్‌ ఎక్కువ ఉంటే వాటి జోలికి వెళ్తే మీకు విశ్రాంతి దూరం అవుతుంది. ఇలాంటి కార్యకలాపాలను సాయంత్రమే ముగించుకోండి. నిద్రకు ముందు గంటలను మరింత ప్రశాంతమైన కార్యకలాపాల కోసం కేటాయించండి.

గడియారం చూడటం, ఆందోళన చెందడం

నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు గడియారాన్ని చూడటం ఆందోళనను పెంచుతుంది. విశ్రాంతి తీసుకోవడం మరింత కష్టతరం చేస్తుంది. అదేవిధంగా, రేపటి పనుల గురించి ఆందోళన చెందడం ఒత్తిడి ప్రేరిత నిద్రలేమికి దారితీస్తుంది. అందుకే రేపటి పనుల గురించి నిద్రపోయేముందు ఎక్కువగా ఆలోచించవద్దు. అదే పనిగా టైమ్‌ని చూస్తూ టెన్షన్‌ పడవద్దు.

ALSO READ: ఎక్కువగా కూర్చోవడం వల్ల ఇన్ని సమస్యలా? ఇది సిగరేట్‌ కంటే డేంజర్ బాసూ!

#sleep-tips-telugu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe