Sleeping : లోన్లీ(Lonely) గా ఉండడం అంటే ఒక్కరే ఉండడమని కాదు. చుట్టూ వంద మంది ఉన్నా ఈ లోకంలో లేకపోవడం. చాలామంది ఒంటరితనం అంటే సింగిల్‌గా లైఫ్(Single Life) లీడ్ చేసేవాళ్లు అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కొంతమంది సోలో లైఫ్(Solo Life) లీడ్ చేస్తున్న కూడా ఎంతో హ్యాపీ(Happy) గా ఉంటారు. మరికొంతమంది మాత్రం నలుగురితో ఉన్నా జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటారు. మరికొంతమంది జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటలను నిత్యం తలుచుకుంటూ అదో లోకంలో బతుకుతుంటారు. ఇంకొంతమంది ఎవరో చేసిన అన్యాయాన్ని భరించలేక లైఫ్‌లో కావాల్సినవాళ్ల అందరిని దూరం చేసుకుంటారు. ఒంటరిగా గడుపుతుంటారు. అలాంటి వారికి నిద్ర విషయంలో అనేక సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి.
ఒంటరితనం నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోండి:
⦿ కష్టం కష్టంగా: ఒంటరితనం ఒత్తిడి, ఆందోళన స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది. ఇది రెస్ట్ తీసుకోడానికి, నిద్రపోనివ్వడాన్ని కష్టతరం చేస్తుంది.
⦿ క్వాలిటీ లేని నిద్ర: ఒంటిరితనాన్ని సమస్యగా భావించేవారు నిద్ర సమయంలో సడన్‌గా మేల్కొంటారు. ఇది నాణ్యత లేని నిద్రకు దారి తీస్తుంది.
⦿ నిద్రలేమి: నిరంతర ఒంటరితనం నిద్రలేమికి దారితీస్తుంది. ఇది నిద్రపోవడాన్ని కష్టంగా మార్చే రుగ్మత.
⦿ ఆటంకాలు: ఒంటరితనం వల్ల పీడకలలు, రాత్రి చెమటలు, ఇతర నిద్ర ఆటంకాలు ఏర్పడవచ్చు. ఇది స్లీప్ క్వాలిటీకి మరింత భంగం కలిగిస్తుంది.
⦿ మార్నింగ్ టైమ్‌లో అలసట: ఒంటరితనం కారణంగా సరిగా నిద్రపోకపోవడం వల్ల పగటిపూట అలసట ఉంటుంది. చేసే పని పట్ల ఏకాగ్రత ఉండదు.
⦿ ఒంటరితనం నిద్రకు అనేక విధాలుగా భంగం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మెంటల్ హెల్త్‌తో పాటు ఫిజికల్ హెల్త్‌ను పాడు చేస్తుంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించండి. అవసరం అయితే వైద్య నిపుణుడిని సంప్రదించండి. అప్పుడు నిద్రకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.
ALSO READ: పశువుల్లో ఈ వ్యాధి పాల ఉత్పత్తిని తగ్గిస్తుంది.. పాడి రైతులూ జాగ్రత్త పడండి..!