Sleep: నిద్ర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే వైద్యులు 7 నుంచి 8 గంటలు నిద్ర పోవాలని చెబుతారు. మంచి నిద్ర శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ప్రస్తుత లైఫ్‌స్టైల్ వల్ల తగినంత నిద్ర పొందలేక.. అనేక ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నిద్ర శరీరంపై చెడు ప్రభావం ఎలా చూపుతుందో..? మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి శరీరంపై ఎలాంటి చెడు ప్రభావం చూపుతుంది:
- నిద్రలేమి మెదడుపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. దీనివల్ల మెదడు పనితీరు, ఏకాగ్రత తీవ్రంగా దెబ్బతినటంతోపాటు శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది .
- సరైన నిద్ర లేకపోతే జలుబు, ఫ్లూ వంటి వ్యాధులతో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మంచిగా నిద్రపోతే శరీరం సైటోకిన్‌లను, ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్‌తో పోరాడటానికి సహాయపడే ప్రోటీన్‌లను తయారు చేస్తుంది. దీంతో రోగాలు రాకుండా ఉంటాయి.
- నిద్ర సరిగా లేకపోయే సమస్య ఉంటే గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక బీపీ, రక్తంలో షుగర్‌స్థాయి పెరగడం, దీర్ఘకాలిక సమస్యలతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయి.
- నిద్ర లేకపోవడం వలన ఆకలిని నియంత్రించే హార్మోన్లు ప్రభావితం అవుతాయి. దీనివలన బరువు, ఊబకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి
- మానసిక ఆరోగ్యానికి నిద్రకు దగ్గరి సంబంధం ఉంది. అందుకే మనిషికి సరైన నిద్ర అవసరం . సరిగా నిద్రపోలేని వ్యక్తులలో ఆందోళన, డిప్రెషన్, చిరాకు, ఒత్తిడి, తోపాటు భావోద్వేగ అస్థిరతలు తలెత్తుతాయి .
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా.. ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: శిశువుకు పాలు సరిపోవట్లేదా.. తల్లులు ఈ చిట్కాలు పాటించండి