Skin Care: మీ ముఖము అందంగా ఉండటానికి కారణమిదే .. ఇది తీసుకుంటే చాలు..!

చర్మ సౌందర్యానికి అసలైన కారణం విటమిన్ C..  చర్మం ప్రకాశవంతగా, అందంగా కనిపించాలంటే ఇది చాలా అవసరం.. మీ డైలీ రొటీన్ లో విటమిన్ C(Vitamin C) ఉత్పత్తులు లేదా విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. 

New Update
Skin Care: మీ ముఖము అందంగా ఉండటానికి కారణమిదే .. ఇది తీసుకుంటే చాలు..!

Skin Care: అందం పై మరింత శ్రద్ధ పెడుతున్న ఈ రోజుల్లో ప్రతిఒక్కరు అందగా కనిపించాలని కోరుకుంటారు.. ఈ మధ్యకాలంలో అందంగా కనిపించాలని పార్లర్లకు వెళ్లి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. అలాగే ఇంట్లో కూడా రకరకాల చిట్కాలను మొహం పై ప్రయోగిస్తుంటారు. కానీ చర్మ సౌందర్యానికి అసలైన కారణం విటమిన్ C..  చర్మం ప్రకాశవంతగా, అందంగా కనిపించాలంటే ఇది చాలా అవసరం.. మీ డైలీ రొటీన్ లో విటమిన్ C(Vitamin C) ఉత్పత్తులు లేదా విటమిన్ C ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.

విటమిన్ C ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా సహాయపడుతుంది. విటమిన్ సి లో ఉండే యాంటీఆక్సిడెంట్స్(Antioxidants) చర్మం ప్రకాశవంతగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అలాగే ఇది చర్మాన్ని మృదువుగా చేసి, ఆరోగ్యకరమైన చర్మం కోసం కొల్లాజెన్(collagen) ను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.

సహజంగానే మన చర్మంలో విటమిన్ సి(Vitamin C) ఉంటుంది. కానీ వయస్సు పెరగడం, కాలుష్యం, UV కిరణాలు చర్మం పై పడటం వల్ల చర్మంలో ఉండే విటమిన్ సి శాతం తగ్గిపోతుంది. అందుకే విటమిన్ C ని ఆహారం రూపంలో తీసుకుంటే అది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

ముడతలు, చర్మం పై గీతాలను తగ్గిస్తుంది

చాలా మంది తక్కువ వయసులోనే మొహం పై ముడతలు వస్తున్నాయని బాధపడతారు. విటమిన్ C మొహం పై ముడతలను తగ్గించి చర్మాన్ని మృదువుగా తయారు చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మొహాన్ని  ఆరోగ్యాంగా ఉంచుతుంది.

సూర్య కిరణాల నుంచి కాపాడుతుంది

ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు ట్యాన్ అవ్వడం, చర్మం పొడిబారడం, ఎర్రబడటం వంటి సమస్యలు వస్తాయి. వీటి నుంచి సురక్షితంగా ఉండటానికి యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే విటమిన్ సి ఉత్పత్తులను వాడితే చర్మం UV కిరణాలు బారిన పడకుండా ఆరోగ్యాంగా ఉంటుంది. విటమిన్ E, విటమిన్ C కాంబినేషన్ చాలా చక్కగా పని చేస్తుంది.

చర్మాన్ని తేమగా ఉంచుతుంది

విటమిన్ C చర్మం పొడిబారకుండా ఎల్లప్పుడు తేమగా ఉండేలా చేస్తుంది. ఇది చర్మంలో నీటిని నిల్వ ఉండేలా చేసి చర్మం జిడ్డుగా, పొడిగా అవ్వకుండ కాపాడుతుంది.

పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తుంది:

మెలనిన్ ఉత్త్పత్తి ఎక్కువ కావడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. విటమిన్ C మొహం పై ఏర్పడిన ఆ నల్లటి మచ్చలను తగ్గిస్తుంది. అలాగే పాడైన చర్మాన్ని సరి చేసి ఆరోగ్యాంగా చేస్తుంది.

అలాగే  విటమిన్ C సీరం మొహం పై ముడతలు, మచ్చలు, నల్లటి ప్యాచ్ లను తొలగించి చర్మం మృదువుగా, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. కానీ చర్మ ఉత్పత్తులను వాడే ముందు మీ చర్మ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. నిపుణులను సంప్రదించి వాడాలి.

Also Read: Sleeping health Tips: రాత్రి పదిలోపే నిద్రపోతే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Advertisment
తాజా కథనాలు