Tips to Lose Fat in Your Face: బరువు పెరగడంతో పొట్ట చుట్టూ, నడుము, కాళ్లు, తొడలు, చేతులతో పాటు ముఖంపై కూడా కొవ్వు పేరుకుపోతుంది. అతిగా కొవ్వు పేరుకుపోవడం రూపాన్ని పాడు చేస్తుంది.అయితే ముఖంపై పేరుకుపోయిన కొవ్వును తగ్గించడం అంత సులభం కాదు. ముఖంపై పేరుకున్న కొవ్వును ఫేషియల్ ఫ్యాట్ అంటారు. ఇది ముఖ సౌందర్యాన్ని తగ్గిస్తుంది. అయితే, కొన్ని పద్ధతులను క్రమం తప్పకుండా పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
షుగర్ లెస్ చూయింగ్ గమ్ నమలడం
చూయింగ్ గమ్ ముఖ కండరాలకు వ్యాయామంగా ఉపయోగపడుతుంది. ఇది ఫేషియల్ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.
స్టీమ్
ముఖం కొవ్వును తగ్గించడానికి ఆవిరి సహాయపడుతుంది. ఇది ఫేస్ టోన్, ఆకృతిని మెరుగుపరుస్తుంది. ఆవిరి ద్వారా ముఖంలోని రంధ్రాలు తెరుచుకొని.. చెమట, టాక్షిన్స్ బయటకు వెళ్తాయి. ఫలితంగా ముఖంలో నీరు తగ్గిపోయే ఫ్యాట్ తగ్గడంలో సహాయపడుతుంది. లావెండర్ లేదా యూకలిప్టస్ వంటి ముఖ్యమైన నూనెలతో వారానికి ఒకసారి ముఖ ఆవిరిని తీసుకోండి.
చల్లని చెంచాతో రుద్దడం
ముందుగా రిఫ్రిజిరేటర్‌లో చెంచాను చల్లబరచండి. ఇది రక్త ప్రవాహాన్ని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. దీంతో అప్పుడప్పుడు ముఖం పై మసాజ్ చేయండి. అతిగా చేయడం మంచిది కాదు అని గుర్తుంచుకోండి.
గ్రీన్ టీ ఐస్ క్యూబ్స్
గ్రీన్ టీని ఐస్ క్యూబ్స్‌లో ఫ్రీజ్ చేసి ముఖంపై సున్నితంగా మసాజ్ చేయండి. ఐస్ క్యూబ్స్ నరాలను ప్రభావితం చేసి ముఖం పై కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.
లాఫింగ్ వ్యాయామం
చిరునవ్వు మీ మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ముఖ కండరాలను కూడా ఉత్తేజపరుస్తుంది. ఇది కాలక్రమేణా మీ ముఖాన్ని టోన్ చేయడంలో, బిగుతుగా మార్చడంలో సహాయపడుతుంది. ముఖానికి మంచి ఆకృతిని అందిస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.