Skin Care: 10 నిమిషాల్లో మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!

అమ్మాయిలకు అన్నింటి కంటే ముఖ్యమైనది వారి ముఖ సౌందర్యం. అమ్మాయిలు వారికి ఎన్ని పనులున్నా సరే ముఖం పై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందంగా, ప్రకాశవంతగా మెరిసిపోయే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందం వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  ఈ సింపుల్ టిప్స్ తో పాటిస్తే 10 నిమిషాల్లో అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

New Update
Skin Care:  10 నిమిషాల్లో మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!

Skin Care: అమ్మాయిలకు అన్నింటి కంటే ముఖ్యమైనది వారి ముఖ సౌందర్యం. అమ్మాయిలు వారికి ఎన్ని పనులున్నా సరే ముఖం పై మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అందంగా, ప్రకాశవంతగా మెరిసిపోయే చర్మం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందం వాళ్ళలోని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  ఈ సింపుల్ టిప్స్ తో పాటిస్తే 10 నిమిషాల్లో అందమైన, మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

ముందు ముఖాన్ని శుభ్రంగా కడగాలి

మీ చర్మానికి సూట్ అయ్యే ఫేస్ వాష్ లేదా క్లెన్సర్ తో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.ఇది చర్మంలోని డెడ్ సెల్స్ , దుమ్ము, ధూళిని తొలగించి ముఖంలో కాంతివంతమైన ఛాయను తీసుకొస్తుంది.

పేస్ మాస్క్ వాడాలి 

ముఖం పై ఫేస్ మాస్క్ వాడటం వల్ల అది చర్మాన్ని మరింత కాంతివంతగ చేస్తుంది. తేనే, పసుపు, పెరుగు ఇలా సహజ ఉత్పత్తులను కలిగిన ఫేస్ మాస్క్ ను 10 నిమిషాల పాటు ధరించి ఆ తర్వాత మొహం కడిగితే కేవలం10 నిమిషాల్లో మీ మొహన్ని మెరిసేలా చేస్తుంది.

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి

చర్మం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండాలంటే మాయిశ్చరైజర్ తప్పని సరిగా రాసుకోవాలి. హైలురానిక్ ఆసిడ్, అలోవెర, గ్లిసరిన్ వంటి పదార్థాలు ఉన్న మాయిశ్చరైజర్ ను వాడటం వాళ్ళ మీ చర్మం రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

హై లైటర్ వాడండి 

హై లైటర్ మొహం పై అప్లై చేస్తే కొద్దీ నిమిషాల్లోనే మెరిసిపోయే చర్మాన్ని అందిస్తుంది. మీ చర్మ సున్నితత్వానికి సరిపడే హై లైటర్ తీసుకొని దాన్ని చెంపల పై భాగంలో, ముక్కు పై అప్లై చేస్తే అది ముఖం ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.

నీళ్లు ఎక్కువగా తాగాలి

చర్మం ఎల్లప్పుడూ తేమగా పొడిబారకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. దాని వల్ల చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి.

సరైన నిద్ర తప్పనిసరి

మెరిసే చర్మం, కాంతివంతమైన ఛాయా కావాలంటే సరైన నిద్ర తప్పనిసరి. రోజుకు 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి. సరైన నిద్ర చర్మాన్ని రిపేర్ చేయడంతో పాటు ముఖం ప్రకాశవంతంగా ఉండటానికి సహాయపడుతుంది.

ముఖం పై ఏదైనా ప్రయోగించేటప్పుడు చర్మ సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. సహజంగా చర్మం కాంతివంతగా ఉండాలంటే సరైన నీళ్లు, నిద్ర తప్పనిసరి అవసరం వాటితో పాటు మనం వాడే సరైన చర్మ ఉత్పత్తులు అవసరం.

Also Read: Digestion: అజీర్ణ సమస్య ఉన్నవాళ్లు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చాలు..?

Advertisment
తాజా కథనాలు