Jobs: ఈ స్కిల్స్ మీ సొంతమైతే డబ్బే డబ్బు.. యూత్ తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు! కాలం మారుతోంది. కాలంతో పాటే మనమూ మారాలి. అందుకే కొత్త స్కిల్స్‌పై దృష్టి పెట్టాలి. కంటెంట్, సోషల్‌మీడియా మార్కెటింగ్‌లో స్కిల్స్ ఉన్నవారికి అనేక జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. అటు SEOలకు సైతం డిమాండ్ గట్టిగా ఉంది. ఇలాంటి జాబ్ కోసం ఎలాంటి స్కిల్స్ కావాలో తెలుసుకోవడానికి ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Trinath 26 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Skills for Youth: ఏంటో.. ఎంత కష్టపడుతున్నా జీతం పెరగడంలేదు. వచ్చే శాలరీ ఖర్చులకు సరిపోవడం లేదు. ధరలు పెరుగుతున్నాయి కానీ జీతం పెరగదు. ఇలా అయితే ఎలా అని ఆలోచిస్తున్నారా? కేవలం థింక్ మాత్రమే చేసి ఆగిపోవద్దు.. ఏదో ఒక స్టెప్ తీసుకోవాల్సిందే. కాలంతో పాటు మారాల్సిందే. అందుకే మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సులపై ఎప్పటికప్పుడు ఓ లుక్కేస్తూ ఉండాలి. అవసరం అనిపిస్తే వాటిని నేర్చుకోవాలి. వీటితో పాటు కొన్ని స్కిల్స్‌ను మన బ్లడ్‌లోకి ఎక్కించుకోవాలి.. అప్పుడే కెరీర్ బెటర్ అవుతుంది. మరి ఎలాంటి స్కిల్స్ ఉండాలో తెలుసుకుందామా..! సోషల్ మీడియా మార్కెటింగ్ (Social Media Marketing): ప్రస్తుతం దేశంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా సైట్‌లలో 95 కోట్లకు పైగా అకౌంట్లు క్రియెటై ఉన్నాయి. అంటే దేశ జనాభాలో దాదాపు 75శాతం మంది సోషల్‌మీడియా యూజ్ చేస్తున్నారు. అందుకే చాలా మంది తమ ప్రొడక్ట్స్‌ను సోషల్‌మీడియాలో ప్రమోట్ చేసుకుంటున్నారు. చాలా కంపెనీలు పెద్ద ఎత్తున సోషల్ మీడియా విక్రయదారులను నియమించుకుంటున్నాయి. మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్సు ద్వారా సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ అండ్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ (Content Marketing): మంచి కంటెంట్ ఎలా రాయాలో మీకు తెలిస్తే డబ్బులు బాగా సంపాదించవచ్చు. కంటెంట్ మార్కెటింగ్ ఫీల్డ్‌లో ఎన్నో అవకాశాలుంటాయి. ఏదైనా కంపెనీకి చెందిన ప్రకటనలు, సేల్స్ పేజీలు, ల్యాండింగ్ పేజీలు, సోషల్ మీడియా పోస్ట్‌లు మొదలైనవాటిని నిర్వహించడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో తక్కువ సమయంలో ఈ స్కిల్స్‌ను పొందవచ్చు. 3-సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్: ఈ ఫీల్డ్‌లో మీరు వెబ్‌సైట్ కంటెంట్ కోసం వర్క్ చేస్తారు. గూగుల్(Google), యాహూ(Yahoo) లాంటి సెర్చ్ ఇంజిన్‌లలో తమ వెబ్‌సైట్ మొదటి కనిపించేలా చేసేది ఎస్‌ఈవో(SEO)లే. ప్రస్తుతం దేశంలో 5 కోట్లకు పైగా వెబ్‌సైట్లు ఉన్నట్టు అంచనా. వాటిని ఆప్టిమైజ్ చేయడానికి SEO ఎక్స్‌పర్ట్ అవసరం. Also Read: భారత్‌లో పేదరికం తగ్గిపోయింది: నీతి అయోగ్ WATCH: #jobs #digital-marketing మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి