CBN Row: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిర్బంధాలు.. చంద్రబాబు అరెస్ట్‌తో హై డ్రామా!

నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీలో హైడ్రామా నెలకొంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత అరెస్ట్ అవ్వడంతో ఏపీలోని అన్ని జిల్లాలో టీడీపీ లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. ఇటు నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. అటు అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.

CBN Row: ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోన్న నిర్బంధాలు.. చంద్రబాబు అరెస్ట్‌తో హై డ్రామా!
New Update

AP SKILL development scam: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీ వ్యాప్తంగా నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్‌ హాల్‌ వద్ద ఆయన్ను అరెస్ట్‌ చేశారు సీఐడీ పోలీసులు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ డబ్బు రూ.241 కోట్లు అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి డబ్బులు కాజేశారని అభియోగాలున్నాయి. ఈ ఆరోపణలపైనే చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునివ్వడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా తెలుగుదేశం నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు

ఉమ ఇంటి వద్ద టెన్షన్:

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటి వద్ద భారీగా మోహరించారు పోలీసులు. తెల్లవారుఝాము 4.30 గంటల నుంచే పోలీస్ పహారాలో ఉంది గొల్లపూడి. పలువురు టీడీపీ నేతలను కార్యకర్తలను అరెస్టు చేసి భవానిపురం స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.



సౌమ్య హౌస్ అరెస్ట్:

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హౌస్ అరెస్ట్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో తంగిరాల సౌమ్య ను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు టీడీపీ నేతలను పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.

అనిత ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు:

విశాఖపట్నంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగల పూడి అనిత ఇంటికి భారీగా చేరుకున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్‌కి రావాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని అనిత అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏ కారణంతో పోలీస్‌స్టేషన్‌కి రావాలో చెప్పాలని అనిత ప్రశ్నించారు.

బుచ్చిబాబు నిర్భందం:

అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడు అరెస్టుతో ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు(బుచ్చిబాబు), గుత్తుల సాయి ఇతర తెలుగుదేశం నాయకులు హౌస్ అరెస్టు చేశారు.



ఆయ్యన్న ఇంటి వద్ద టెన్షన్:

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్నను హౌస్ అరెస్ట్ చేశారు. పలువురు మండల స్థాయి నాయకులను అదుపులో తీసుకుంటున్నారు పోలీసులు.

అసలేం జరిగింది?

కర్నూలు , నంద్యాలలో 2 రోజులు పర్యటించేందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు గత రాత్రి ఆర్‌కే(RK) ఫంక్షన్ హాల్‌లో బస చేశారు. ఆయన్ని అరెస్టు చేస్తారనే ప్రచారం జరగడంతో... రాత్రి 11 గంటలకి వందల మంది టీడీపీ శ్రేణులు, నేతలు అక్కడికి వచ్చారు. ఆ తర్వాత దాదాపు 500 మంది పోలీసులు అక్కడికి వచ్చారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతల మధ్య గొడవ జరిగింది. చాలా సేపటి తర్వాత ఈ రోజు ఉదయం 5 గంటలకు చంద్రబాబును అరెస్ట్‌ చేశారు పోలీసులు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది.

ALSO READ: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు.. FIRలో తన పేరు లేదంటున్న టీడీపీ అధినేత!

#ex-andhra-chief-minister-chandrababu-naidu-arrested #skill-development-case #ap-skill-development #chandrababu-arrest #ap-skill-development-scam #chandrababu-naidu-arrested #chandrababu-naidu-arrested-in-corruption #chandrababu-naidu-arrested-in-skill-development-case
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe