kadapa: కడప జిల్లాలో కిలాడీ లేడి ఆశా కార్యకర్త మోసాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియా ద్వారా ఓ యువకుడితో పరిచయం పెంచుకున్న ఓ ఆశా కార్యకర్త కాసుల కోసం కక్కుర్తి పడింది. వాలంటీర్ తో కలిసి స్కెచ్ వేసి అతడిని కిడ్నాప్ చేసింది. అనంతరం యువకుడి కుటుంబ సభ్యులను డబ్బు డిమాండ్ చేసింది. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదించారు. అసలేం జరిగిందంటే?
Also read: ఏపీలో వాగుదాటబోయి ముగ్గురు గల్లంతు.. వీడియో వైరల్
సీఎం జగన్ జిల్లా కమలాపురానికి చెందిన ఓ కిలాడీ లేడీ ఆశా కార్యకర్తగా ఉంటూ మోసాలకు పాల్పడింది. రాజంపేట మండలం ఇసుకపల్లికి చెందిన వెంకటేష్ తో కమలాపురం కు చెందిన ఆశా వర్కర్ ఫేస్ బుక్ లో పరిచయం చేసుకుంది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి తరుచూ ఫోన్లో మాటామంతి కొనసాగించేంది. తరువాత కలుద్దామని చెప్పి ఈ నెల 3వ తేదీన కడపకు రప్పించింది. అయితే, కిలాడీ లేడీ.. వాలెంటీర్ నవీన్, అతని స్నేహితుడు ప్రతాప్ తో కలిసి ముందుగానే డబ్బులకు స్కెచ్ వేసింది. అనుకున్న ప్లాన్ ప్రకారమే అతడిని కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత వెంకటేష్ కుటుంబ సభ్యులను డబ్బులు డిమాండ్ చేసింది. అడిగినంత డబ్బు ఇస్తేనే వదిలేస్తామని బెదిరింపులకు దిగింది.
Also Read: అధిక కట్నం డిమాండ్ చేసిన బాయ్ ఫ్రెండ్.! యువతి ఏం చేసిందంటే?
బాధితుని బంధువులు వెంటనే రైల్వే కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సాంకేతిక పరిజ్ఞానంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు కేసును కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు. వెంకటేష్ ను బంధువులకు అప్పగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.