తమన్ నుంచి మరో 'స్కంద' పురాణం

తమన్ సంగీతం గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోతుంది. ప్రేక్షకులను సీట్లల్లో కూర్చోనివ్వదు. ఇప్పుడు ఈ దర్శకుడు సరికొత్త సినిమాతో ముందుకొస్తున్నాడు. అదేంటో చూద్దాం

New Update
తమన్ నుంచి మరో 'స్కంద' పురాణం

Skanda Second Single:

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ లో ఉన్నాడు తమన్. ఇప్పుడీ సంగీత దర్శకుడు స్కంద (Skanda)సినిమాపై ఫోకస్ పెట్టాడు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలకు సిద్ధమైంది.

మాస్ మేకర్ బోయపాటి శ్రీను ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఉస్తాద్, రామ్ పోతినేనితో మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ ‘స్కంద- ది ఎటాకర్‌’ రూపొందిస్తున్నాడు. మోస్ట్ హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే చిత్ర యూనిట్ మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. టైటిల్‌ గ్లింప్స్ కు అద్భుతమైన స్పందన లభించగా, థమన్ స్కోర్ చేసిన ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ చార్ట్‌లలో టాప్ లో ఉంది.

ఇప్పుడు స్కంద సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఆగస్ట్ 18న స్కంద సెకండ్ సింగిల్ గందారబాయ్ (GandaraBai)ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రామ్ (Hero Ram) శ్రీలీల (Sree leela) పార్టీ వేర్ లో కలర్ ఫుల్ గా కనిపించారు. ఇప్పటికే వీళ్లిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజా సాంగ్ తో రామ్-శ్రీలీల కెమిస్ట్రీ పీక్స్ కు చేరినట్టయింది.

Also Read: షూటింగ్ అప్ డేట్స్.. ఏ సినిమా ఎక్కడ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు