Six Guarantees: ప్రజాపాలన.. మొదటి రోజు @7,46,414 దరఖాస్తులు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రారంభించిన మొదట రోజే రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

Six Guarantees: ప్రజాపాలన.. మొదటి రోజు @7,46,414 దరఖాస్తులు
New Update

Six Guarantees Application Forms: ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీ అమలుకు కసరత్తు చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో ప్రజా పాలన కార్యక్రమం కింద ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణను నిన్న (గురువారం) ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం జనవరి 6 వరకు కొనసాగనుంది. ఇదిలా ఉండగా.. ప్రజా పాలన ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,711 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుండి జిహెచ్ఎమ్ సి తో సహా 4,57,703 దరఖాస్తులు స్వీకరించామని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై నేడు జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు దాన కిషోర్, సందీప్ సుల్తానియా లు కూడా పాల్గొన్న ఈ టెలీ కాన్ఫరెన్స్ లో సి.ఎస్. మాట్లాడుతూ, ప్రతీ కేంద్రంలోనూ సరిపడా ఆరు గ్యారెంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని స్పష్టం చేశారు.

మొదటి రోజైన గురువారం నాడు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించిందని అన్నారు. ఈ అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ గ్రామ సభలకు హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూ లైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతీ వంద మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రజా పాలనలో స్వీకరించిన ప్రతీ దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని మరోసారి తెలిపారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు గాను ప్రత్యేక హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలన్నారు.

ALSO READ:

  1. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..!
  2. గుడ్ న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బు జమ
#telangana-latest-news #congress-six-guarantees #congress-praja-palana #telangana-6-guarantee-schemes-application-form
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe