ఆడపిల్లల కష్టాలు తెలుసుకున్న తార.. హ్యాట్సాఫ్ సితార

చాలా మంది కుటుంబ సభ్యుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేయడం, పండ్లు పంపిణీ చేయడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ తన కూతురి పుట్టిన రోజు నాడు వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకునేవాళ్ల చాలా తక్కువ మంది ఉంటారు. అందే రీతిలో సైకిళ్లను పంపిణీ చేయాలని హీరో మహేష్‌బాబు గారాల బిడ్డ సితార నిర్ణయించుకున్నారు.

ఆడపిల్లల కష్టాలు తెలుసుకున్న తార.. హ్యాట్సాఫ్ సితార
New Update

అయితే తమ బర్త్‌ డే వేడుకలను చాలా మంది సేహ్నితులు, బంధువులను, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఘనంగా చేసుకోవాలనుకుంటారు. కొంతమంది మాత్రం అనాథ పిల్లలతో, పేదవాళ్లతో జరుపుకోవాలనుకుంటారు. అలాంటి లిస్ట్‌లో ఘట్టమనేని సితార కూడా చేరారు. చిన్న వయసులోనే ఇంత సాయం చేసి తండ్రి మహేష్‌బాబును మించిపోయింది ఈ బుల్లి తార.

Sitara good heart on her birthday. Mother surpasses father in helping

హీరో మహేష్‌బాబు కుతూరు సితార తను చేస్తున్న పనులతో తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. నటనలోనే కాకుండా దానగుణంలో కూడా తండ్రిని మించిపోతుంది. మొదటి కమర్షియల్ యాడ్‌లో నటించిన సితార.. తనకు వచ్చిన డబ్బుతో ఛారిటీకి రాసిచ్చేసింది. దీంతో సితారను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అభిమానులు. తాజాగా మరోసారి గొప్ప మనసు సితార చాటుకుంది. తన పుట్టినరోజును పేద పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. పేదలతో కలిసి చాలా మంది సెలబ్రిటీలు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉంటారు అది మనం చుస్తునే ఉంటాము. కానీ ఇందులో కొత్తేముందని అనుకోకండి. నిజంగానే సితార బర్త్ డే వేడుకలో చాలా స్పెషల్ ఉంది. ఆ స్పేషల్‌ పేద పిల్లల సంతోషంగా ఉన్నారు.. అదేంటంటే అంటే సితార తన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పేద పిల్లలకు సైకిళ్లను బహుమతులుగా ఇచ్చింది.

publive-image

దీనిపై హీరో మహేష్‌బాబు స్పందిస్తూ 11వ ఏటలో అడుగుపెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. నువ్వు నా స్టార్ వి. నువ్వు అనుకున్నది సాధిస్తావ్ అంటూ ట్వీట్ చేశారు. ఇక నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఈ వీడియోను ఫోస్టు చేస్తూ బర్తడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ బాలికలు తమ కొత్త రైడ్ పట్ల ఆనందంగా ఉన్నారు. స్కూల్‌ కేవలం సైకిల్‌పై వెళ్లేంత దూరంలో ఉంది. నీలో ఉన్న ఆలోచనాత్మక, ప్రేమను చూపించే పెద్ద మనసుకి లవ్ యు చిట్టి తల్లి. నీ మహిమాన్వితమైన ప్రయాణంలో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలను ఎన్నో సృష్టించాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. నిజంగా ఒక యువరాణి.. విలాసవంతంగా తన బర్త్ డే వేడుకలు చేసుకోవచ్చు కానీ చాలా సింపుల్‌గా, ఆర్భాటం లేకుండా పేద పిల్లలతో కలిసి జరుపుకోవాటం చాలా గ్రేట్..హ్యాట్సాఫ్ సితార. జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమాలు.

Sitara good heart on her birthday. Mother surpasses father in helping

అయితే ఈరోజు సితార బర్త్‌డే సందర్భంగా మహేష్ బాబు ఫౌండేషన్‌లో పిల్లలు,టీచర్ల మధ్య ఎంతో సంతోషంగా జరుపుకుంది సితార. అక్కడ ఆడ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి.. అనంతరం అక్కడున్న వారందరికీ పింక్ కలర్ లేడీస్ సైకిళ్లను బహుమతిగా సితార ఇచ్చారు. దీంతో అక్కడున్న ఆడపిల్లలంతా సంతోషం వ్యక్తం చేశారు. సితార తమతో కలిసి పుట్టినరోజు చేసుకోవడం.. మాకు సైకిల్ బహుకరించడం ఆనందంగా ఉందన్నారు. నిజంగా ఇంత చిన్న వయసులో ఇతరుల గురించి ఆలోచించడం అంటే మాములు విషయం కాదు కధా. సితార తన తోటి పిల్లల కోసం ఇలా ఆలోచించిందంటే ఎంతో గొప్ప విషయమే. ప్రస్తుతం సితార ఉన్న మంచి మనసుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe