దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు..ఆ ఊర్లో మాత్రం దసరా రోజున శ్రీరామనవమి..!

రాములవారి కల్యాణం అనగానే మనకు శ్రీరామనవమి గుర్తుకు వస్తుంది. నేడు శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా రామాలయాల్లో ఘనంగా రాములవారి కల్యాణం జరిగింది. కానీ విజయదశమి రోజు రాములోరి కల్యాణం జరగడం ఎక్కడైనా చూశారా? కనీసం విన్నారా? అయితే ఈ స్టోరీ చదవండి.

New Update
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు..ఆ ఊర్లో మాత్రం దసరా రోజున శ్రీరామనవమి..!

Seeta Rama Kalyanam on Dussehra: చైత్రమాసం శుద్ధనవమి రోజు ప్రపంచవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకులను ఘనంగా జరుపుకుంటుంది. జగదేకవీరుడైన శ్రీరామచంద్రుడి కల్యాణోత్సవంతో ఆ రోజు ప్రతిఊరు మురిసిపోతుంది. శ్రీరామనవమి రోజు అన్ని గ్రామాల్లో రామాలయాలు భక్తులతో సందడిగా మారుతాయి. అయితే ఇందుకు భిన్నంగా దసరా రోజు శ్రీరామచంద్రుని కల్యాణం చేసే గ్రామం ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా భీమభక్తుని పాలెంలో (Bhima Bakthuni Palem) విజయదశమి రోజు శ్రీరామనవమిని జరుపుకుంటారు. ఆ రోజే రాములోరి కల్యాణం జరుగుతుంది.

అమలాపురం పట్టణానికి సమీపంలో ఉన్న భీమభక్తునిపాలెంలో శ్రీరామనవమి కేవలం పానకాల ఉత్సవంగా జరుపుకుంటారు. ఊర్లో ఉన్న రామాలయంలో పానకాలు పంచిపెడుతుంటారు. ఇక రాములవారి కల్యాణం మాత్రం దసరా రోజు నిర్వహిస్తారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్న ఆచారమని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? గతంలో ఈ గ్రామంలో నివసించే వారంతా  నేత కార్మికులు. వీరికి వేసవికాలంలోనే ఎక్కువగా పని ఉండేది. దీంతో ఎండాకాలంలో వీరంతా పనుల కోసం బయటకు వెళ్లేవారు. గ్రామంలో ఎవరూ ఉండకపోవడంతో శ్రీరామనవమి రోజు ఉర్లో ఉన్న కొంతమంది మాత్రం శ్రీరాముడికి పూజలు చేసి పానకాలు పంచి పెట్టేవారు.

ఇది కూడా చదవండి : లక్ష్యం ముందు..పేదరికం చిన్నది..సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన బీడీ కార్మికురాలి బిడ్డ..!

దసరా నాటికి పనులు పూర్తి చేసుకుని గ్రామానికి తిరిగి వచ్చేవారు. అందుకే దసరా రోజు రాములోరి కల్యాణం నిర్వహించి శ్రీరాముడి పట్టాభిషేకం చేశారు. అయితే కాలాలు మారినా కూడా ఆ ఊరి జనం మాత్రం అదే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. శ్రీరామనవమి రోజు పానకాలు పంచిపెట్టి..దసరా రోజు ఘనంగా రామకల్యాణం నిర్వహిస్తారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు