/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/cm-jagan-7-1-jpg.webp)
Stone Pelting Attack : సీఎం జగన్(CM Jagan) పై రాయి దాడి కేసులో అధికారులు కీలక పురోగతి సాధించారు. ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అదుపులోకి తీసుకుంది. అయితే ఈ ఐదుగురిలో ఒక యువకుడు జగన్‌పై దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీఏస్ పోలీసు(CCS Police) ల అదుపులో నిందితుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన యువకుడిగా పోలీసులు గుర్తించారు. దాడి చేయడం వెనుక ఉన్న కారణాలతో తెలుసుకునేందుకు పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. సీఎం జగన్ బస్సు యాత్ర(Bus Yatra) లో వచ్చినప్పుడు పబ్లిక్‌లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించగా.. నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఒక యువకుడిని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌కు పోలీసులు చూపించినట్లు సమాచారం.
Also Read: పవర్ కట్ చేసి ఏ ఉద్దేశంతో చీకటిలో యాత్ర చేశారు : పవన్ కల్యాణ్