Sirisilla Polyester Textile Industry : సిరిసిల్ల పాలిస్టర్ పరిశ్రమ బంద్..కారణం ఏంటంటే? సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడింది. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలు పరిశ్రమ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. By Madhukar Vydhyula 15 Jan 2024 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి Sirisilla : సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ నేటి నుంచి నిరవధికంగా మూతపడింది. దేశవ్యాప్తంగా టెక్స్‌టైల్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కొత్త ఆర్డర్లు రాకపోవడంతో నేతన్నలు పరిశ్రమ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రాలకు సంబంధించిన బిల్లుల బకాయిలు రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. దీంతో యజమానులు పెట్టుబడులు పెట్టి వస్త్రాలను ఉత్పత్తి కొనసాగించలేమని తేల్చి చెబుతున్నారు.సిరిసిల్ల పవర్ లూమ్ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వులు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులపై అనిశ్చితి కొనసాగుతోంది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని పరిశ్రమల యాజమాన్యాలు అంటున్నాయి. దీంతో నిర్వహకులు కొత్త పెట్టుబడులు పెట్టుబడులు పెట్టలేక, ఉత్పత్తి చేసిన వస్త్రాల విక్రయం కొనసాగక నేతన్నల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పటికే గోడౌన్లలో లక్షల మీటర్ల వస్త్రం నిలువలు పేరుకుపోయాయి. దీంతో పాలిస్టర్ యజమానులు కొత్త నూలు కొనుగోలు చేసి ఉత్పత్తి కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నది. నిజానికి గత ప్రభుత్వం ఇచ్చిన బతకమ్మ చీరల ఆర్డర్ ముగిసినప్పటి నుంచే సిరిసిల్లలో పవర్‌లూమ్ పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. ఇప్పుడు పాలిస్టర్ పరిశ్రమ బంద్ నిర్ణయంతో వేలాదిమంది పవర్ లూమ్, నేత కార్మికులు, పరిశ్రమ మీద ఆధారపడ్డ కూలీలు ఉపాధి కోల్పొయే అవకాశం ఉంది. టెక్స్ టైల్ పార్కుకు, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. కేవలం 600లోపు మగ్గాలున్న టెక్స్‌టైల్ పార్కుకు, 25,000 మగ్గాలకు మించి ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సమాన ఆర్డర్లు ఇస్తామని చెప్పడాన్ని పాలిస్టర్ పరిశ్రమ యజమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల వందలాది పరిశ్రమలు మూసుకోవలసిన పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో నిరవధిక బంద్ తప్పదని వారు తేల్చి చెబుతున్నారు. కార్మికులకు అండగా ఉండాలి : మంత్రి తుమ్మల ఆదేశం సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ మూసివేతపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. కార్మికులకు అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పరిశ్రమ పరిస్థితిపై రిపొర్టు ఇవ్వాలని కోరారు. #sirisilla #state-government #polyester-textile-industry మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి