Telangana: వ్యక్తిని చంపేసిన తల్లీ, కూతురు.. వెలుగులోకి భయంకర నిజాలు..

రోజూ తాగివచ్చి వేధింపులకు గురి చేస్తున్న భర్తను కూతురు సహాయంతో దారుణంగా హత్య చేసింది భార్య. సిరిసిల్ల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. సినీ ఫక్కీలో శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో హుటాహుటిన అంత్యక్రియలు చేశారు.

New Update
Britain: అక్రమ వలసదారుల పై బ్రిటన్‌ ఉక్కుపాదం.. 12 మంది భారతీయుల అరెస్ట్‌!

Sircilla News: మద్యం తాగి వచ్చి నిత్యం వేధింపులకు గురి చేస్తున్న భర్తను హత్య చేసిన భార్యతో పాటు హత్యకు సహకరించిన కూతురిని కూడా అరెస్ట్ చేశారు సిరిసిల్ల పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ హత్యకు సంబంధించిన వివరాలను మంగళవారం నాడు సిరిసిల్ల సిఐ ఉపేందర్ మీడియాకు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణ సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణం శివనగర్ చెందిన లేచర్ల ప్రకాష్ రావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడని, ప్రకాష్ రావు అంత్యక్రియలు కూడా అనుమానాస్పదంగా జరిపారని ఈనెల నాలుగవ తేదీన శాంతి కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిపాయి. ప్రకాష్ రావు జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తూ తన భార్య స్వప్న, తన కూతురు ఉషశ్రీ లను అనుమానించేవాడు. వారు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారంటూ నిరంతరం అనుమానిస్తూ ఉండేవాడు. దాంతో ఎలాగైనా ప్రకాష్‌ను అడ్డు తొలగించుకోవాలని భార్య స్వప్నతో పాటు కూతురు ఉష ప్లాన్ వేశారు.

నవంబర్ 1వ తేదీన అర్దరాత్రి ప్రకాష్ రావు నిద్రిస్తున్న సమయంలో కూతురు దిండుతో ముఖంపై అదిమిపట్టగా, భార్య కత్తితో గొంతు కోసి హతమార్చింది. అనంతరం ప్రకాష్ రావు మృతదేహాన్ని కత్తులతో, గోడ్డలితో ముక్కలుగా నరికి వేరే చోటకు తరలించాలని ప్రయత్నించారు. అయితే, అది సాధ్యం కాకపోవడంతో, మృతదేహాన్ని ఇంట్లోనే గొయ్యి తీసి పాతి పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో ఇంట్లోనే పెట్రోల్ పోసి తగలబెట్టారు. అయితే, మంటల పెద్దగా రావడంతో.. వెంటనే మంటలను ఆర్పేసి తమ బాబాయ్‌కి కాల్ ఫోన్ చేశారు. మృతదేహం పూర్తిగా కాలక పోవడంతో దుర్వాసన వచ్చింది.

దాంతో ఈనెల 4వ తేదీన ఉష బాబాయ్ సూచన మేరకు కొద్ది మంది బంధువుల సహాయంతో మృతదేహానికి హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు ఎవరూ లేకుండా కేవలం నలుగురు వ్యక్తులే హుటాహుటిన అంత్యక్రియలు నిర్వహించారు. దాంతో అనుమానం వచ్చిన శానిటరీ ఇన్స్పెక్టర్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా ప్రకాష్ రావుని తన భార్య, కూతురు హత్య చేసినట్లుగా తేలింది. నిందితుల వద్ద హత్యకు ఉపయోగించిన పరికరాలు స్వాధీనం చేసుకొని, రిమైండ్ కి పంపినట్లు పట్టణ సీఐ ఉపేందర్ తెలిపారు.

Also Read:

వారిని ఖచ్చితంగా జైల్లో వేస్తాం.. ప్రధాని మోదీ సంచలన కామెంట్స్..

 కొడంగల్‌లో రేవంత్ వర్సెస్ పట్నం నరేందర్ రెడ్డి.. ఎవరి బలం ఏంటో తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు