Sini Shetty in Miss World 2024: 2024 లో జరిగే 71 మిస్ వరల్డ్ పోటీలకు రెండో సారి భారత దేశం ఆతిథ్యము ఇస్తుంది. చివరిగా 1996 బెంగళూర్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ భారతదేశం (India) వేదికగా నిలవడం ఆసక్తిగా మారింది. చివరిగా 1996 బెంగళూర్ లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫిబ్రవరి 18న మొదలైన మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మార్చి 9 వరకు కొనసాగనున్నాయి. ఢిల్లీలోని భారత్ కన్వెన్షన్ సెంటర్, ముంబాయిలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ 2024 కాంపిటీషన్స్ లో 120 దేశాల పోటీదారులు తమ అందంతో పాటు ప్రతిభను కూడా ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నారు. భారతదేశానికి ప్రతినిధిగా కర్ణాటకకు చెందిన ఫెమినా మిస్ ఇండియా సినీ శెట్టి (Sini Shetty) ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మిస్ ఇండియా సినీ శెట్టి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకోండి..
సినీ శెట్టి స్వస్థలం కర్ణాటక.. పుట్టి పెరిగింది మహారాష్ట్రలో. 21 ఏళ్ల వయసున్న ఈ అందాల భామ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. సినీ మోడలింగ్ తో పాటు భరత నాట్యలో కూడా శిక్షణ పొందారు.
2022 ఫెమినా మిస్ ఇండియాగా కిరీటం గెలిచిన ఈ బ్యూటీ.. 2024 మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. భారత్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లో అడుగు పెట్టిన సినీకి అందరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మిస్ వరల్డ్ బరిలోకి దిగిన ఈ బ్యూటీ.. తాజాగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. "నువ్వే నా లక్ష్యం, నువ్వే నా గుర్తు .. నా దేశపు త్రివర్ణ పతాకాన్ని చేతిలోనే కాదు గుండెల్లో పెట్టుకున్నాను.." అంటూ భారత దేశం పట్ల గర్వం వ్యక్తం చేశారు.