BIG BREAKING: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జస్టిస్ ఖన్నాకి లాయర్ సింఘ్వీ చెప్పారు. రిమాండ్‌తో కంఫ్లిక్ట్ కారణంగా సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సింఘ్వీ తెలిపారు. By Trinath 22 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు జస్టిస్ ఖన్నాకి లాయర్ సింఘ్వీ చెప్పారు. కేజ్రీవాల్ ఇప్పుడు దిగువ కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆప్ వర్గాలు చెబుతున్నాయి. రిమాండ్‌పై వాదించి తిరిగి సుప్రీంకు వస్తామని సింఘ్వీ చెప్పారు. ఈ విషయమై తాను రిజిస్ట్రీకి లేఖ ఇస్తానన్నారు సింఘ్వీ. రిమాండ్‌తో కంఫ్లిక్ట్ కారణంగా సుప్రీంలో పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నామని సింఘ్వీ తెలిపారు. #BREAKING Arvind Kejriwal decides to withdraw the petition filed in #SupremeCourt challenging #ED arrest. Sr Adv AM Singhvi tells Justice Sanjiv Khanna that Kejriwal will withdraw the petition and contest the remand. A bench of J Khanna, MM Sundresh & Bela Trivedi was to hear… pic.twitter.com/dOdUO16PZ3 — Live Law (@LiveLawIndia) March 22, 2024 నిజానికి ఈడీ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆప్ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా ద్వివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించాల్సి ఉండగా.. కేజ్రీవాల్ మాత్రం పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలేం జరిగింది? ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. సెర్చ్ వారెంట్‌తో కేజ్రీవాల్ అధికారిక నివాసానికి చేరుకున్న దర్యాప్తు సంస్థకు చెందిన 12 మంది సభ్యుల బృందం గురువారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ కేజ్రీవాల్ పిటిషన్‌ను విచారించింది. కేజ్రీవాల్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. 'రిమాండ్‌తో విభేదిస్తున్నందున' కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు దర్యాప్తు సంస్థ ముఖ్యమంత్రిని ప్రశ్నించే తొలి రౌండ్‌ను ఇప్పటికే ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అటు కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై నిఘా పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. దర్యాప్తు సంస్థకు ఆధారాలు లభించాయని తెలుస్తోంది. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలోని మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్‌లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ ఇది పూర్తి గూండాయిజం అని అన్నారు. అటు ఢిల్లీలో పరిస్థితులు అదుపుతప్పకుండా ఉండేలా చూసుకునేందుకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ మేట్రో, పోలీసుల అభ్యర్థన మేరకు ఈరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ITO మెట్రో స్టేషన్‌ను మూసివేశారు. ఐటీఓ చౌక్ వద్ద రహదారిని మూసివేయడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డుపై వాహనాలు బారులు తీరాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హోలీకి ఇళ్లకు వెళ్లి షాపింగ్‌కు వెళ్లేవారు కూడా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. Also Read: కవితకు షాక్.. బెయిల్ నిరాకరణ! #arvind-kejriwal #delhi-liquor-scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి