Sarkaaru Noukari Trailer: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోలు, డైరెక్టర్ల సరి కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అప్పట్లో చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోల వారసులు హీరోలుగా పరిచయమయ్యేవారు. కానీ ఇప్పుడు ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాంకర్, సింగర్స్ ఇలా సినిమాకు సంబంధించిన ఇతర విభాగాల నుంచి కూడా హీరోలు వస్తున్నారు. ఇలాగే సింగర్ సునీత (Singer Sunitha) తనయుడు ఆకాశ గోపరాజు హీరోగా పరిచయమవుతున్నారు.
Also Read: శ్రీలీల ఫ్యాన్స్.. గుంటూరు కారంలో ఆ పాట ఉండే ఛాన్స్ కనబడటం లేదు!
టాలీవుడ్ ఫేమస్ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ గోపరాజు (Akash Goparaju) ఫస్ట్ మూవీ 'సర్కారు నౌకరి' తో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు శేఖర్ గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. R.K టెలీషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కె.కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సర్కారు నౌకరి వచ్చే ఏడాది 2024 జనవరి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో సినిమా కథను తెరకెక్కించారు.
ట్రైలర్ లో "ప్రభుత్వ ఉద్యోగం అంటే జీతాలు తీసుకోవడం కాదు.. ప్రజలకు సేవ చేయడం" అంటూ హీరో చెప్పిన డైలాగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమాలో హీరో ఒక ప్రభుత్వ ఉద్యోగి. గ్రామాల్లో నిరోధ్ వాడకం పై ప్రజలకు అవగాహన కల్పించడం.. వాటిని గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ఉద్యోగిగా హీరో జాబ్. హీరో ఇలాంటి ఉద్యోగం చేయడం అతని భార్యకు నచ్చదు.. దాంతో ఆమె నేను కావలా..? ఉద్యోగం కావాలా తేల్చుకోమని చెప్తుంది. ఆ తర్వాత హీరో ఏం నిర్ణయం తీసుకుంటాడు.. ఏం చేస్తాడు అనే ఆసక్తికర అంశాలతో ట్రైలర్ సాగింది. ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా భావన నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, మధులత, సాయి శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి, మని చందన మహాదేవ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు