యూపీలో కుట్ర... పాక్ నుంచి ఆయుధాలు దిగుమతి... సిద్దూ మూసే వాలా హత్య కేసులో కీలక విషయాలు...!

పంజాబ్ గాయకుడు సిద్దూ మూసే వాలా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్దూ హత్యకు యూపీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సిద్దూను హత్య చేసేందుకు ఆయుధాలను పాక్ నుంచి దుండగులు దిగుమతి చేసుకున్నారు.. సిద్దూ హత్య కేసులో దర్యాప్తు అధికారుల చేతికి కీలక ఫోటోలు చిక్కినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

author-image
By G Ramu
యూపీలో కుట్ర... పాక్ నుంచి ఆయుధాలు దిగుమతి... సిద్దూ మూసే వాలా హత్య కేసులో కీలక విషయాలు...!
New Update

పంజాబ్ గాయకుడు సిద్దూ మూసే వాలా(sidhu moose wala) హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిద్దూ హత్యకు యూపీలో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సిద్దూను హత్య చేసేందుకు ఆయుధాలను(weapons) పాక్ నుంచి దుండగులు దిగుమతి(import) చేసుకున్నారు.. సిద్దూ హత్య కేసులో దర్యాప్తు అధికారుల చేతికి కీలక ఫోటోలు చిక్కినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.

సిద్దూ హత్యుకు ముందు బిష్ణోయ్ గ్రూపునకు చెందిన సభ్యులు లక్నోతో పాటు అయోధ్యలో సంచరించారు. ఆ సమయంలో వారి చేతిలో అత్యాధునిక ఆయుధాలు వున్నట్టు ఫోటోల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ ఆయుధాలను బిష్ణోయ్ గ్రూపు సభ్యులు పాక్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు అంచనా వేస్తున్నారు. మొదట ఓ స్కామ్ లో నిందితున్ని హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్రూపు సభ్యులు యూపీ వెళ్లారు.

కానీ అక్కడ వారి ప్లాన్ ఫెయిల్ అయింది. దీంతో ప్రముఖ సింగర్ సిద్దూ మూసేవాలను వాళ్లు టార్గెట్ చేసుకున్నారని పోలీసు సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఫోటో గ్రాఫ్ లల్లో బిష్ణోయ్ గ్రూపునకు చెందిన షార్ప్ షూటర్ సచిన్ థాపన్ బిష్ణోయ్, సచిన్ బిశ్వాణి, కపిల్ పండిట్ లు ఉన్నట్టు చెప్పారు. అందులో లారెన్స్ బిష్ణోయ్ కు అత్యంత సన్నిహితుడైన సచిన్ బిష్ణోయ్ యూపీలోని ఇతర గ్యాంగ్ సభ్యులతో కొన్ని రోజుల పాటు యూపీలో వున్నట్టు పేర్కొన్నారు.

బిష్ణోయ్ గ్యాంగ్ కు చెందిన షూటర్లు అయోధ్యలో ఓ ఫౌమ్ హౌస్ లో కొన్ని రోజుల పాటు స్టే చేసినట్టు ఆయన వివరించారు. అక్కడ వాళ్లు ఫైరింగ్ ఎలా చేయాలో ప్రాక్టీస్ చేశారన్నారు. ఆ ఫామ్ హౌస్ స్థానిక నేత వికాస్ సింగ్ కు చెందినదిగా గుర్తించామన్నారు. దీంతో ఇప్పుడు బిష్ణోయ్ గ్రూపు సభ్యులకు సహాయం చేసిన వారిని గుర్తించే పనిలో వున్నామన్నారు.

ఇ* ఇలా వుంటే గత వారం అంతర్జాతీయ ఆయుధాల డీలర్ బిష్ణోయ్ కు అత్యంత సన్నిహితుడు ధర్మన్ జోత్ సింగ్ ను కాలి ఫోర్నియాలో అరెస్టు చేసి భారత్ కు తీసుకు వచ్చారు. గత ఏడాది మే 29న పంజాబ్‌ లోని మాన్సా జిల్లాలో సిద్దూ మూసేవాలాను దుండగులు హత్య చేశారు. వాహనంలో వెళుతుండగా సిద్ధూ మూసే వాలాపై కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు.

#up #plat #weapons #sidhu-moose-wala #pakisthan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe