Singer Mangli: ఆ రోజు జరిగింది అదే.. యాక్సిడెంట్ పై రియాక్టైన సింగర్ మంగ్లీ

సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనీ.. స్వల్ప గాయాలతో ఆమె బయటపడ్డారని పలు రకాల వార్తలు వైరలయ్యాయి. తాజాగా ఈ ఘటనపై మంగ్లీ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని.. ఇది 2రోజుల క్రితం అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదమని క్లారిటీ ఇచ్చారు. పుకార్లను నమ్మొద్దని కోరారు.

New Update
Singer Mangli: ఆ రోజు జరిగింది అదే.. యాక్సిడెంట్ పై రియాక్టైన సింగర్ మంగ్లీ

Singer Mangli: టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ రోడ్డు ప్రమాదానికి గురి కావడం జరిగిందని వార్తలు వచ్చాయి. శనివారం రాత్రి ఆమె ప్రయాణిస్తున్న కారును డీసీఎం వాహనం వెనుక నుంచి బలంగా డీ కొట్టడంతో.. మంగ్లీ తో సహా కారులో ఉన్న ఇద్దరి వ్యక్తులకు గాయాలయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Also Read: Hyderabad : సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు

యాక్సిడెంట్ పై రియాక్ట్ అయిన మంగ్లీ

అయితే తాజాగా ఈ సంఘటన పై సింగర్ మంగ్లీ స్పందించారు. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. తాను క్షేమంగా ఉన్నానని.. ఈ సంఘటన రెండు రోజుల క్రితం అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం. దయచేసి ఈ ఘటనకు సంబంధించి వస్తున్న రకరకాల పుకార్లను ఎవరూ నమ్మొద్దూ. తన పై చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ పెట్టింది.

సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లే బ్యాక్ సింగర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకుంది. ముఖ్యంగా మంగ్లీ పాడే బతుకమ్మ, బోనాలు, ఫోక్ సాంగ్స్ కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఒక మామూలు సింగర్ గా కెరీర్ స్టార్ చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా మారిపోయింది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మంగ్లీ పాడిన 'కళ్యాణి వచ్చా వచ్చా' పాటకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Allu Arjun: మరో మల్టీప్లెక్స్ ఓపెనింగ్ ప్లాన్ చేసిన అల్లు అర్జున్.. ఎక్కడో తెలిస్తే షాకవుతారు..!

Advertisment
తాజా కథనాలు