Singer Mangli Marriage: సింగర్ మంగ్లీ తన పెళ్లి పై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది. ఒక టెలివిజన్ యాంకర్ గా తన జీవితాన్ని మొదలు పెట్టిన మంగ్లీ.. సంగీతం పై తనకున్న ఇష్టంతో ఆల్బమ్స్ చేయడం మొదలు పెట్టింది. ఎన్నో హిట్ ఆల్బమ్స్ చేసి జానపద గాయిని గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉండే ఆమె పాటలు ఎంతో ప్రజాదరణ పొందాయి. తెలంగాణ ప్రత్యేక పండగ 'బతుకమ్మ' పై ఆమె చేసిన ఆల్బమ్ తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. తన పదునైన స్వరంతో సినిమాల్లో పాటలు పాడి వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది.
సింగర్ గా(Singer) మంచి గుర్తింపును తెచ్చుకున్న మంగ్లీ బడా హీరో సినిమాల్లో సైతం ఆమె గొంతు వినిపించింది. ఎన్నో సూపర్ హిట్ పాటలను తన ఖాతాలో వేసుకుంది. పుష్ప సినిమాలో ఆమె పాడిన "Oo Antava Oo Oo Antava" పాట మంగ్లీ కెరియర్ కు మంచి సక్సెస్ ను అందించింది.
తాజాగా విడుదలైన మెగాస్టార్ భోళాశంకర్ సినిమాలో పాడిన "Jam Jam Jajjanaka" అనే సూపర్ హిట్ సాంగ్ పాడింది. ఆమె పాడిన 'సారంగా దరియా' సాంగ్ కూడా ఆడియన్స్ బాగా క్రేజ్ సంపాదించింది. ఇలా మంచి సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మంగ్లీ మాస్ పాటలకు చాలా మంది అభిమానులు ఉంటారు.
సినిమా పాటలతో బిజీ బిజీగా ఉన్న మంగ్లీ(Mangli) పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి. తను పెళ్లి చేసుకునేది తన బావనే అని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. అయితే సింగర్ మంగ్లీ ఈ వార్తల పై స్పందిస్తూ.. నా పెళ్లి(Marriage) పై వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ పుకార్లు మాత్రమేనని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదని క్లారిటీ ఇచ్చింది. నాకు తెలియని బావ ఎక్కడున్నాడో ఈ పుకార్లను పుట్టించిన వాళ్ళే చెప్పాలని సమాధానమిచ్చింది.
Also Read: Varun Tej: వరుణ్ కంటే లావణ్య వయస్సులో ఎంత పెద్దదో తెలుసా..?