/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-66-3.jpg)
Singaro Singa Song From Swag Movie : టాలీవుడ్ లో రీసెంట్ గా సామజవరగమన, ఓం భీం బుష్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. త్వరలోనే ‘స్వాగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీవిష్ణు నటించిన ‘రాజ రాజ చోర’ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ వదిలారు.
'సింగరో సింగ' అనే పేరుతో రిలీజైన ఈ సాంగ్ క్యాచీ లిరిక్స్, డిఫెరెంట్ బీట్ తో ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటతో సోషల్ మీడియా సెన్సేషన్, వైరల్ కింగ్ సింగరేణి అకా సింగగా శ్రీ విష్ణు పాత్రను పరిచయం చేశారు. ఇందులో శ్రీవిష్ణు డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్నాడు.వివేక్ సాగర్ కంపోజ్ చేసిన ఈ పాటను బాబా సెహగల్, వైకోమ్ విజయలక్ష్మి ఎనర్జిటిక్‌గా పాడారు. నిక్లేష్ సుంకోజీ లిరిక్స్ రాశాడు.
The 𝐒𝐖𝐀𝐆 King 𝐒𝐈𝐍𝐆𝐀 is here... Inka Internet Baddhaleyy!! 😎 #SingaVachesadu 🤩🥁
Revealing the Social Media Sensation, #SINGA aka @sreevishnuoffl 🤘#SWAG 1st Single #SingaroSinga is Out Now 🧑 - https://t.co/CWQ9d2Aj1K
A #VivekSagar Musical 🎶
🎤 @OnlyBabaSehgal… pic.twitter.com/NXse8zDq1q— People Media Factory (@peoplemediafcy) July 18, 2024
Also Read : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో’మహారాజ’ రేర్ ఫీట్!
చాలా రోజుల తర్వాత బాబా సెహగల్ పాడిన సాంగ్ కావడంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ వైరల్ గా మారింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ ఎంటర్టైనర్ గా సాగనుంది. సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఆగస్టు చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.