Telangana Singareni: సింగరేణిలో ఎన్నికల సందడి మొదలైంది. బొగ్గుగనిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణ తేదీని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి గతంలోనే నోటిఫికేషన్ ఇవ్వగా నామినేషన్ల ప్రకియ కూడా చేపట్టారు. అయితే, అంతలోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో సింగరేణిలో ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరడంతో ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎన్నికల సంఘం కీలక ప్రకటన
హైదరాబాద్‌లో సింగరేణి(Singareni) ఎన్నికల అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఓటరు లిస్టును కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు. టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి; ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్, బీఎంఎస్, ఐఎఫ్‌టీయూ, తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు.