TG Jobs; కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ...వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో మొత్తం 327 ఖాళీలను పూర్తి చేసేందుకునోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.
జూన్ 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://scclmines.com/ వెబ్‌సైట్ లో చూడవచ్చు.
మొత్తం పోస్టుల వివరాలు - 327
ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
మేనేజ్‌మెంట్ ట్రైనీ , ఇ2 గ్రేడ్: 42 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ , ఇ2 గ్రేడ్: 07 పోస్టులు.
నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు
జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ , టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 100 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ , టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 09 పోస్టులు
అసిస్టెంట్ ఫోర్‌మెన్ ట్రైనీ , టి అండ్ ఎస్ గ్రేడ్-సి: 24 పోస్టులు
ఫిట్టర్ ట్రైనీ, కేటగిరీ-I: 47 పోస్టులు
ఎలక్ట్రీషియన్ ట్రైనీ, కేటగిరీ-I: 98 పోస్టులు
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.100గా నిర్ణయించారు. దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి.